AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్త‌రాంధ్ర‌కు పాకిన కరోనా ! ఏపీలో కొత్తగా 54 కేసులు

ఉత్త‌రాంధ్ర‌లో క‌రోనా తగ్గినట్టే తగ్గి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో ఈ జిల్లాలో12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఉత్త‌రాంధ్ర‌కు పాకిన కరోనా ! ఏపీలో కొత్తగా 54 కేసులు
Jyothi Gadda
|

Updated on: May 08, 2020 | 3:25 PM

Share

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌టం లేదు. తాజాగా మ‌రో 54 పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఏపీలో గత 24 గంటలలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. కొత్తగ నమోదైన కేసులలో అనంతపురం జిల్లాలో అత్యధికంగా 16 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో 7, కృష్ణాలో 6 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.  విశాఖలో 11 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887కు చేరుకుంది. ఇక ఉత్త‌రాంధ్ర‌లో క‌రోనా తగ్గినట్టే తగ్గి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో ఈ జిల్లాలో12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో విశాఖ జిల్లాలో 11, విజయ నగరం జిల్లాలో 1 కేసు ఉన్నాయి. మొదటి నుంచీ కరోనా ఫ్రీ జిల్లాగా ఉన్న విజయ నగరంలో స్వల్ప వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య  4కు పెరిగింది.