కరోనా కట్టడికి రంగంలోకి దిగిన పారామిలటరీ బలగాలు..
దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైందని గుజరాత్‌లోనే. ఈ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీనితో మే 7 నుంచి మే 15 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్‌ను పాటించాలని నగర మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది. అత్యవసర సేవలు మినహాయించి మొత్తం అన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరగా.. ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. అహ్మదాబాద్, సూరత్‌లలో ఉన్న […]

దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైందని గుజరాత్‌లోనే. ఈ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీనితో మే 7 నుంచి మే 15 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్‌ను పాటించాలని నగర మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది. అత్యవసర సేవలు మినహాయించి మొత్తం అన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరగా.. ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి.
అహ్మదాబాద్, సూరత్‌లలో ఉన్న కంటైన్మెంట్ జోన్లలో ఈ పారామిలటరీ బలగాలు విధులు నిర్వహిస్తాయని.. రాష్ట్ర సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం వీళ్లను స్పెషల్ ఫ్లైట్‌లో పంపిందని గుజరాత్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శివానంద్ ఝా తెలిపారు. అటు రాత్రిపూట కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందని.. కఠినమైన నిబంధనలు ప్రజలు ఈ వారం రోజులు ఖచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు.
Read More:
మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!
కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్..
#Coronaupdates AMCમાં મળેલી બેઠકમાં મોટો નિર્ણય દૂધ, દવા સિવાયની તમામ સેવા બંધ રાખવા આદેશ, અમદાવાદમાં 15 મે સુધી તમામ સેવા બંધ કરવા ઇંચાર્જ મ.ન.પા. કમિશનરનો આદેશ. pic.twitter.com/2zGkvFTjGp
— PIB in Gujarat (@PIBAhmedabad) May 6, 2020
