కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 39 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 2.70 లక్షల మరణాలు

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 39 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 2.70 లక్షల మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 212 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 3,918,174 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 5589 మంది చనిపోవడంతో […]

Ravi Kiran

|

May 08, 2020 | 1:54 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 212 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 3,918,174 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 5589 మంది చనిపోవడంతో ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 270,741 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 1,344,278 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(1,292,850), మరణాలు(76,938) అమెరికాలోనే నమోదయ్యాయి. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 56,409 కేసులు నమోదు కాగా.. 1,890 మృతి చెందారు.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

 • అమెరికా – 1,292,850 కేసులు, 76,938 మరణాలు
 • స్పెయిన్ – 256,855 కేసులు, 26,070 మరణాలు
 • ఇటలీ – 215,858 కేసులు, 29,958 మరణాలు
 • బ్రిటన్ – 206,715 కేసులు, 30,615 మరణాలు
 • రష్యా – 177,160 కేసులు, 1,625 మరణాలు
 • ఫ్రాన్స్ – 174,791 కేసులు, 25,987 మరణాలు
 • జర్మనీ – 169,430 కేసులు, 7,392 మరణాలు
 • బ్రెజిల్ – 135,773 కేసులు, 9,190 మరణాలు
 • టర్కీ – 133,721 కేసులు, 3,641 మరణాలు
 • ఇరాన్ -103,135 కేసులు, 6,486 మరణాలు
 • చైనా – 82,886 కేసులు, 4,633 మరణాలు
 • ఇండియా – 56,409 కేసులు, 1,890 మరణాలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu