ఆస్ట్రేలియా సిరీస్ కోసం.. 2 వారాల క్వారంటైన్‌కు టీమిండియా రెడీ: బీసీసీఐ

ఆస్ట్రేలియా సిరీస్ కోసం.. 2 వారాల క్వారంటైన్‌కు టీమిండియా రెడీ: బీసీసీఐ

కోవిద్-19 విజృంభిస్తోంది. అగ్రరాజ్యాలను సైతం వణికిస్తోంది. ఈ వైరస్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడా కార్య‌క‌లాపాలు వాయిదా ప‌డిన సంగతి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్‌తోపాటు ఐపీఎల్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 08, 2020 | 3:43 PM

Team India: కోవిద్-19 విజృంభిస్తోంది. అగ్రరాజ్యాలను సైతం వణికిస్తోంది. ఈ వైరస్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడా కార్య‌క‌లాపాలు వాయిదా ప‌డిన సంగతి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్‌తోపాటు ఐపీఎల్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. ఈ క్రమంలో రాబోయే ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న కోసం భార‌త ప్లేయ‌ర్లు రెండు వారాల‌పాటు క్వారంటైన్‌లో ఉండ‌టానికి సిద్ధ‌మ‌ని బీసీసీఐ తెలిపింది.

వివరాల్లోకెళితే.. భార‌త టూర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చాలా ఆశ‌లు పెట్టుకుంది. తీవ్ర‌మైన ఆర్థిక ఒడిదుడుకులు నెల‌కొన్న వేళ ఈ టూర్ కోసం సీఏ 50 మిలియ‌న్ల డాల‌ర్ల అప్పు కూడా చేసింది. తాజాగా బోర్డు వ్యాఖ్యల‌పై సీఏకు ఆనందం క‌లిగించి ఉంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా రెండు వారాల‌పాటు క్వారంటైన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం కోరితే, అందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌ తెలిపారు.

కాగా.. ఈ టూర్ వ‌చ్చే న‌వంబ‌ర్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. అంత‌కుముందు ఆస్ట్రేలియాలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్ ఉంది. ఈ టోర్నీ జ‌రిగితే, భార‌త టూర్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌బోవ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో క‌రోనా వైర‌స్ తగ్గుముఖం ప‌ట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో 6900 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 97 మంది మ‌ర‌ణించారు. కొత్త పాజిటివ్ కేసులు చాలా త‌క్కువ సంఖ్య‌లో నమోద‌వుతున్నాయి.

Also Read: కర్నూలులో టెన్షన్.. ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురికి కరోనా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu