కర్నూలులో టెన్షన్.. ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురికి కరోనా..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే.. నంద్యాలలో ఒకే కుటుంబంలో

కర్నూలులో టెన్షన్.. ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురికి కరోనా..
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 10:28 AM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే.. నంద్యాలలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది. ఇంతకు మునుపే కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలోని అతడి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడుకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ కుటుంబంలోని ఇద్దరు శుద్ధ జల నీటి సరఫరా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

కాగా.. వీరిలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో నీటి కోసం వచ్చే వారిలో ఆందోళన నెలకొంది. ఈ కుటుంబం కాంటాక్టు లిస్టును తయారు చేసి వారందరినీ క్వారంటైన్‌కు పంపే యోచనలో అధికార యంత్రాంగం ఉంది. కరోనా కట్టడి కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీ పరిదిలో సామాజిక వ్యాప్తి పెరిగిపోతుండటం, కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా వెల్లడైన 5 కొత్త పాజిటీవ్‌ కేసులతో మున్సిపాలిటీలో మొత్తం కేసుల సంఖ్య 110కి పెరిగింది. రూరల్‌లోని 9 కేసులతో మొత్తం 119కి పాజిటీవ్‌ కేసులు చేరాయి.