AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meaning Of Dreams : కలలో ఈ జంతువులను చూస్తే రాజయోగం!.. అదృష్టం తలుపు తడుతుంది

అలాగే, కుటుంబం, సామాజిక జీవితంలో మీరు విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలంటున్నారు. అలాంటి వ్యుక్తులు జీవితంలో ప్రతీ విషయాన్ని ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. ఆపదలు వస్తే పోరాడుతారని స్వప్నశాస్త్రం చెబుతోంది. అలాగే, కొందరికీ కలలో కుందేలు కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా కుందేలు కలలో కనిపించటం శుభ సంకేతమని అర్థం. అంటే మీ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీరు ప్రతిదానిలో విజయం సాధిస్తారు.

Meaning Of Dreams : కలలో ఈ జంతువులను చూస్తే రాజయోగం!.. అదృష్టం తలుపు తడుతుంది
Dreams And Meanings
Jyothi Gadda
|

Updated on: Aug 03, 2024 | 3:56 PM

Share

కలలు సాధారణం. కొన్నిసార్లు కలలో జంతువులు కూడా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో కొన్ని జంతువులను కలలో చూడటం చాలా శుభప్రదంగా చెబుతారు. ఆవును స్వప్న శాస్త్రం వివిధ రకాల కలలకు అర్థాలు చెబుతుంది. జంతువులు మీ కలలో పదేపదే కనిపిస్తే మీ అదృష్టం మారుతుందని అర్థం. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి కలలో ఆవు కనిపిస్తే..అదృష్టంగా చెబుతారు. హిందూ మతంలో ఆవుకు గౌరవనీయమైన స్థానం ఉంది. అలాంటి గోమాత మనకు కలలో కనిపిస్తే చూస్తే అది శుభ సంకేతంగా చెబుతున్నారు.. కలలో ఆవును చూడటం అంటే దేవుడు ఆ వ్యక్తికి తన ఆశీర్వాదాలను ప్రసాదించబోతున్నాడని అర్థం. సమీప భవిష్యత్తులో మీరు తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారని స్వప్నశాస్త్రం చెబుతోంది. అలాగే, ఒక వ్యక్తి తన కలలో ఏనుగును చూసినట్లయితే, అతనికి మంచి రోజులు వస్తున్నాయని అర్థం. ఈ కల ఆ వ్యక్తికి సంపద పెరుగుతుందని సూచిస్తుంది. త్వరలో వారికి జీవితంలో ఆనందం, శ్రేయస్సు అందుతుంది.

అలాగే, స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి కలలో పాము కనిపిస్తే మంచికి చిహ్నంగా చెబుతారు. కలలో నల్ల పాము కనిపిస్తే, అది అదృష్టాన్ని సూచిస్తుంది. సమీప భవిష్యత్తులో మీ కీర్తి పెరుగుతుందని అంటారు.. మీ ప్రతి కోరిక నెరవేరుతుందని ఈ కలకు సంకేతం అంటున్నారు నిపుణులు. అలాగే, మీకు కలలో గుడ్లగూబ కనిపిస్తే మీ జీవితంలో సంపద పెరుగుతుందని అర్థం. కలలో గుడ్లగూబను చూడటం వల్ల ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు మీ కలలో తెల్ల సింహాన్ని చూస్తే శుభప్రదంగా చెబుతున్నారు. మీకు కలలో తెల్ల సింహం కనిపిస్తే, మీకు భవిష్యత్తులో పురోగతిని పొందుతారని అర్థం. అలాగే, కుటుంబం, సామాజిక జీవితంలో మీరు విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలంటున్నారు. అలాంటి వ్యుక్తులు జీవితంలో ప్రతీ విషయాన్ని ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. ఆపదలు వస్తే పోరాడుతారని స్వప్నశాస్త్రం చెబుతోంది. అలాగే, కొందరికీ కలలో కుందేలు కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా కుందేలు కలలో కనిపించటం శుభ సంకేతమని అర్థం. అంటే మీ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీరు ప్రతిదానిలో విజయం సాధిస్తారు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..