AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టుకు రంగు వేయకండి.. ఆలూ తొక్కను ఇలా వాడండి..! అరగంటలో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..!!

జాగ్రత్తగా జుట్టంతా తడిసేటట్లు తల, జుట్టుకు పూర్తిగా పట్టించాలి. సుమారు అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయవచ్చు. ఈ మిశ్రమం జుట్టుకి పిగ్మెంటేషన్ ని ఇస్తుంది. దీంతో తెల్లజుట్టు నల్లబడడమే కాకుండా తెల్లజుట్టు తిరిగి రాకుండా ఉంటుంది.4ఆ

జుట్టుకు రంగు వేయకండి.. ఆలూ తొక్కను ఇలా వాడండి..! అరగంటలో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..!!
Potato Peels
Jyothi Gadda
|

Updated on: Jul 27, 2024 | 11:28 AM

Share

సాధారణంగా జుట్టు తెల్లబడే సమస్య 40 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. కానీ, ఈ రోజుల్లో గ్రే హెయిర్ సమస్య పెద్దలకు మాత్రమే కాదు. చిన్న పిల్లలు కూడా నెరిసిన జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న వాతావరణం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మందిలో ఈ సమస్య 20-30 ఏళ్లకే మొదలవుతుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వలన చిన్న వయసులోనే వారంతా చాలా పెద్దవారిలా కనిపిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీనిని కవర్ చేసేందుకు రకరకాల హెయిర్ డై, కలర్ షేడ్లను ఉపయోగిస్తుంటారు. అకాల తెల్ల జుట్టుకు సంబంధించి సాధారణ కారణాలను తెలుసుకోండి. అలాగే జుట్టు నెరిసే ప్రక్రియను నెమ్మదింపజేయడం లేదంటే నిరోధించే మార్గాలను పాటించాల్సి ఉంటుంది. అలాంటి వారికి బంగాళదుంపలు ఉపయోగపడతాయంటే నమ్ముతారు..నెరిసిన జుట్టు సమస్యకు ఆలూ తొక్కలతో పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…

నెరిసిన జుట్టుకు ఆలూ తొక్కను ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. బంగాళాదుంప తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు నిపుణులు. బంగాళాదుంప తొక్కల నుండి తీసిన నీటిలో మెగ్నీషియం, పొటాషియం, నియాసిన్, కాల్షియం, రాగి, జింక్, ఐరన్ వంటివి జుట్టు రాలడం, జుట్టు నెరసిపోకుండా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగాళాదుంప పీల్స్‌లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్‌ను టైరోసినేస్ కూడా పుష్కలంగా లభిస్తుంది.

బంగాళదుంప తొక్కలను జుట్టు సమస్యల కోసం వినియోగించే విధానం పరిశీలించినట్టయితే..ఇందుకోసం ముందుగా 5-6 పెద్ద బంగాళాదుంప తొక్కలను నీళ్లలో బాగా ఉడకబెట్టాలి. ఆ నీరు గంజి లాగా అయ్యేవరకూ మరిగించండి. చల్లారిన తరువాత ఆ నీటిని వడగట్టి తొక్కలు తీసేసి లిక్విడ్‌ని వెరొక బౌల్‌లోకి తీసుకోండి. హెయిర్ వాష్ చేసి, కండిషన్ చేసిన తరువాత ఈ లిక్విడ్ ని తలకు బాగా అప్లై చేయాలి. జాగ్రత్తగా జుట్టంతా తడిసేటట్లు తల, జుట్టుకు పూర్తిగా పట్టించాలి. సుమారు అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయవచ్చు. ఈ మిశ్రమం జుట్టుకి పిగ్మెంటేషన్ ని ఇస్తుంది. దీంతో తెల్లజుట్టు నల్లబడడమే కాకుండా తెల్లజుట్టు తిరిగి రాకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..