Arjuna Bark: ఇది చెక్క బెరడు కాదు.. క్యాన్సర్‌ను సైతం తరిమికొట్టే సంజీవని..ఎలా వాడాలో తెలిస్తే చాలు..

ఈ బెరడు చూర్ణాన్ని తేనెలో కలిపి రాసుకుంటే దాంతో మొటిమలు త్వరగా తగ్గుతాయి. వాటి తాలూకు మచ్చలను తొలగించి మెరిసేలా చేస్తుంది. ఈ బెరడు పొడిని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది. శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉంటే అక్కడ ఈ బెరడు ను అరగదీసి రాస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

Arjuna Bark: ఇది చెక్క బెరడు కాదు.. క్యాన్సర్‌ను సైతం తరిమికొట్టే సంజీవని..ఎలా వాడాలో తెలిస్తే చాలు..
Arjuna Bark
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 26, 2024 | 3:48 PM

ప్రకృతిలో లభించే అర్జున వృక్షం మనకు ఎంతో మేలు చేస్తుంది. అర్జున వృక్షాన్ని తెల్లమద్ది అని కూడా పిలుస్తారు. కలపగా ఉపయోగించే ఈ వృక్షాన్ని ఆయుర్వేద ఔషధాల్లోనూ వాడుతారు. ఈ చెట్టు లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. అనేక రకాల మందుల తయారీలో దీనిని వాడతారు. ఆస్తమా గుండె జబ్బులను ఇది తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె కు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. ఈ బెరడుతో ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెట్టు బెరడు లో క్యాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు, ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తుంది.

అర్జున చెట్టు బెరడుని పాలల్లో వేసుకుని కాచి తాగితే గుండె జబ్బులను నయం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు, అనేక రకాల ఆయుర్వేద మందులు, మెడిసన్ తయారీకి కూడా ఈ బెరడు, ఆకులు వాడతారు. ఈ బెరడు చూర్ణాన్ని తేనెలో కలిపి రాసుకుంటే దాంతో మొటిమలు త్వరగా తగ్గుతాయి. వాటి తాలూకు మచ్చలను తొలగించి మెరిసేలా చేస్తుంది. ఈ బెరడు పొడిని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది. శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉంటే అక్కడ ఈ బెరడు ను అరగదీసి రాస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

ఈ చెట్టు బెరడు ను దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడి ని పాలలో కలిపి తీసుకుంటే ఆస్తమా ను తగ్గిస్తుంది. ఈ చూర్ణం శ్వాస కోశ సమస్యలను నివారిస్తుంది. ఇంకా వీర్య కణాలను వృద్ధి చేస్తుంది. పురుషుల్లో వీర్యం పెరగడానికి సహాయపడుతుంది. సంతాన సాఫల్యత అవకాశాలు పెంచుతుంది. ఈ చెట్టు బెరడు పొడి లో తేనె కలిపి తీసుకుంటే విరిగిన ఎముకలను అతికిస్తుంది. ఈ మిశ్రమం ఎముకలను త్వరగా అతుక్కునేలా చేస్తుంది. మద్ది చెట్టు బెరడు లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక సాంద్రత ను పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..