Anjeer : అంజీర్ పండ్లని నానబెట్టి తింటే ఈ సమస్యలన్నీ పరార్..!

ఇది మన ఎముక ఆరోగ్యానికి మంచిది. ఆస్టియోపోరోసిస్‌ రాకుండా మన ఎముకలను అంజీర్‌ పండు కాపాడుతుంది. అంజీర్‌ పండ్లను పిల్లలకు తరచూ తినిపించటం వల్ల వారి ఎముకలు దృఢంగా మారతాయి. డయాబెటిస్ ఉన్నవారికి తీయగా ఏదైనా తినాలనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అంజీర్‌ పండును తినవచ్చు. ఈ పండు రుచి తీయగా ఉంటుంది. కానీ,

Anjeer : అంజీర్ పండ్లని నానబెట్టి తింటే ఈ సమస్యలన్నీ పరార్..!
అంజీర్‌ పండులో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులోని ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని నిర్వహిస్తాయి. ముఖ్యంగా అంజీర్‌లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చెక్‌ పెడతాయి.
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 26, 2024 | 2:52 PM

అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లు తినడం వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజూ రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల దీన్ని లాభాలు డబుల్ అవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ తింటే మంచిది. మహిళల్లో మెటాబాలీజం, స్టామినాను పెంచుతుంది. కాబ్టటి రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. అంజీర్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే కరగని ఫైబర్‌ రెండూ ఉంటాయి. అంజీర్‌ జీర్ణ ఆరోగ్యానికి మంచిది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయపడుతుంది.

అంజీర్‌లో పాలీఫెనల్స్‌, ఫ్లెవనాయిడ్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్‌ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్‌ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంజీర్‌లోని డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. దీనిలోని విటమిన్ ఎ,సి,ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసి స్కిన్​కు మంచి ఫలితాలు ఇస్తాయి. నానబెట్టిన అంజీర్​ను రోజూ తింటే జుట్టుకు మంచిది.

అంజీర్‌లో ఎన్నో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ కే, ఏ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉండటం వల్ల ఇవి మన శరీర పనితీరుకు ఎంతో ఆరోగ్యకరం. అంజీర్‌ పండులో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులోని ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని నిర్వహిస్తాయి. ముఖ్యంగా అంజీర్‌లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చెక్‌ పెడతాయి.

ఇవి కూడా చదవండి

అంజీర్‌లో పాలీఫెనల్స్‌, ఫ్లెవనాయిడ్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్‌ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్‌ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంజీర్‌ పండులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన కడుపును ఎక్కువ సమయంపాటు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటుకు దూరంగా ఉంచుతుంది. ఫలితంగా మనం క్యాలరీలు తక్కువగా తీసుకున్నట్లవుతుంది.

అంజీర్‌లో కాల్షియం, మెగ్నిషీయం, ఫాస్పరస్‌ అధిక మోతాదులో ఉంటుంది. ఇది మన ఎముక ఆరోగ్యానికి మంచిది. ఆస్టియోపోరోసిస్‌ రాకుండా మన ఎముకలను అంజీర్‌ పండు కాపాడుతుంది. అంజీర్‌ పండ్లను పిల్లలకు తరచూ తినిపించటం వల్ల వారి ఎముకలు దృఢంగా మారతాయి. డయాబెటిస్ ఉన్నవారికి తీయగా ఏదైనా తినాలనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అంజీర్‌ పండును తినవచ్చు. ఈ పండు రుచి తీయగా ఉంటుంది. కానీ, మన రక్తంలో చక్కెర స్థాయిలను పెచ్చదు. వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!