AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం మధ్యలో నీళ్లు తాగుతున్నారా..? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..

భోజనం చేసిన తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేయడానికి, జీర్ణవ్యవస్థ తీసుకునే సహజ సమయాన్ని నీరు తాగడం ద్వారా మార్చేస్తున్నట్టే లెక్క. దీనివల్ల ఊహించిన దాని కంటే ముందుగానే ఆకలి వేస్తుంది. అప్పుడు అతిగా తింటారు. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

భోజనం మధ్యలో నీళ్లు తాగుతున్నారా..? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..
Drinking Water Between Meal
Jyothi Gadda
|

Updated on: Jul 26, 2024 | 12:31 PM

Share

మనలో చాలా మందికి భోజనం మధ్య నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే, మీ ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా..? భోజనం చేసేటప్పుడు నీరు, ముఖ్యంగా చల్లటి నీరు తాగడం అవసరమని కొందరు భావిస్తారు. భోజనం చేసే సమయంలో ఎక్కువ నీటిని తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని చెబుతారు. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఇలా చేస్తే శరీరంలో ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

మనం భోజనం చేస్తూ మధ్యలో నీళ్లు తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం సరైన క్రమంలో జీర్ణం కాదు. సాధారణంగా మనం తింటున్న ఆహారంతో మన శరీరంలో జీర్ణ క్రియ జరగడం కోసం కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అయితే, మనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఆ రసాయనాల ఘాడత తగ్గి మన ఆహారం సరిగా జీర్ణం కాకుండా చేస్తుంది.

భోజనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు దెబ్బతింటాయి. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. జీర్ణక్రియకు లాలాజలం చాలా ముఖ్యం. అయితే, భోజన సమయంలో నీళ్లు తాగడం వల్ల మీ లాలాజలం పలుచన అవుతుంది. సాధారణంగా భోజనంతో పాటు నీళ్లు తాగే వారికి బరువు పెరగడం పెద్ద సమస్యగా మారుతుంది. భోజనం మధ్య నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది.

ఇవి కూడా చదవండి

భోజనం మధ్య నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మొత్తం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. అలాగే, భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగితే బరువు త్వరగా పెరుగుతారని, దీంతో ఊబకాయం బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

భోజనం చేసిన తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేయడానికి, జీర్ణవ్యవస్థ తీసుకునే సహజ సమయాన్ని నీరు తాగడం ద్వారా మార్చేస్తున్నట్టే లెక్క. దీనివల్ల ఊహించిన దాని కంటే ముందుగానే ఆకలి వేస్తుంది. అప్పుడు అతిగా తింటారు. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..