- Telugu News Photo Gallery Diabetes Can Have White Rice In Their Diet Or Not How To Add This In Diet Chart Telugu Lifestyle News
Diabetes Food Tips: మధుమేహం ఉన్నవారు వైట్‌రైస్ తినడం మంచిదేనా..? ఇలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు !
మధుమేహం, బీపీ, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకోసం చాలా మంది వైట్ రైస్ తినడం మానేస్తుంటారు. అన్నం కారణంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తారు. కానీ, ఆయుర్వేద నిపుణులు ప్రకారం వైట్ రైస్ తింటూ కూడా షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం.
Updated on: Jul 26, 2024 | 9:16 AM

మన దేశంలో అన్నం ప్రధాన ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్స్ అధికంగా లభిస్తాయి. ఇది జీర్ణక్రియవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరాని దృఢంగా, శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. ఈ వైట్ రైస్‌లో గ్లూటెన్ ఉండదు. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, ఐరన్ వంటి పోషకాలు సమృధిగా లభిస్తాయి..వైట్‌రైస్‌లో సోడియం లెవెల్స్ అతి తక్కువగా ఉంటాయి. కాబట్టి, హై బీపీ సమస్య ఉన్నవారు అన్నాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే అన్నం వండేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

ఆయుర్వేద నిపుణులు సూచించిన మేరకు వైట్ రైస్ వండుకుని తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. అన్నం వండేందుకు ముందుగా బియ్యాన్ని వేయించుకోవాలని ఆ తరువాత ఎక్కువ నీరు పోసి శుభ్రంగా కడగాలంటున్నారు. ఇలా చేయడం వల్ల అద్భుత ఫలితాలు పొందవచ్చని చెబుతున్నారు. శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయంటున్నారు.

ముందుగా కావాల్సిన మేరకు బియ్యాన్ని తీసుకుని ఒక పాన్‌లో వేసి చిన్న మంటతో వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులోని పిండి పదార్థాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకుండా అన్నం జిగటగా ఉండకుండా, పొడిపొడిగా తయారు అవుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు ఇలా వండిన అన్నం తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది.

ఇకపోతే, అన్నం వండేందుకు ముందుగానే బియ్యాన్ని శుభ్రమైన నీటిలో కనీసం రెండు నుంచి మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. సుమారు అరగంట పాటు ఆ బియ్యం నానిన తరువాత అన్నం వండుకోవాలి... ఇలా చేయడం వల్ల బియ్యం మీద అంటుకున్న మట్టి, ఇతర కణాలు తొలగిపోతాయి. అన్నం పొడిగా వస్తుంది.

సాధారణంగా ఒక గ్లాసు బియ్యానికి రెండు నుంచి రెండున్నర గ్లాసుల నీరు సరిపోతుంది. కాకపోతే, మీరు వాడే బియ్యం రకం ఆధారంగా ఈ నిష్పత్తి మారుతుంది. ఇకపోతే, అన్నం వండే క్రమంలోనే రుచి కోసం కొద్దిగా ఉప్పు వేయవచ్చు. వండుతున్న అన్నంలో నెయ్యి వేయడం వల్ల అన్నం రుచి రెట్టింపు అవుతుంది. పైగా అన్నం అంటుకోకుండా ఉంటుంది.

కేవలం అన్నం మాత్రమే తినడం ఆరోగ్యకరం అంటే సరికాదు. సమతుల్య ఆహారంలో భాగంగా అన్నంతో పాటు కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లు కూడా తప్పనిసరిగా ఉండేలా తీసుకోవాలి. బరువు తగ్గాలంటే కేవలం అన్నం తినడం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా సరైన వ్యాయామం కూడా అవసరం. వాకింగ్, యోగా, ధ్యానం వంటివి కూడా అలవాటు చేసుకోవాలి.





























