అడిగిన వరాలనిచ్చే అదృష్ట దేవత..! కష్టాలను తరిమికొట్టే కప్ప దేవాలయం..!! ఎక్కడుందో తెలుసా..?
ఆలయ నిర్మాణాన్ని కపిల తాంత్రికుడు చేపట్టాడు. పూర్తిగా తాంత్రికతపై ఆధారపడిన ఈ ఆలయ నిర్మాణం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం దాని ప్రత్యేక శైలి కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కప్ప గుడికి దీపావళితో పాటు మహా శివరాత్రి రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
భారతదేశంలోని ప్రసిద్ధ చారిత్రక దేవాలయాల గురించి మీరు వినే ఉంటారు. అయితే ఇక్కడ ఓ విచిత్రమైన కప్ప గుడి ఉంది. అద్భుతమైన సంస్కృతితో నిండిన భారతదేశంలో మీరు వేలాది రంగులలో, అనేక విచిత్రమైన దేవాలయాలను చూస్తుంటారు. వీటి చరిత్ర మీరు చదివినా, లేదా చూసినా కొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. అలాంటిది మన దేశంలో కప్పలను పూజించే ఆలయం కూడా ఉందని మీకు తెలుసా..? దేశంలోనే కప్పలను ఏకైక దేవాలయం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ఓల్ పట్టణంలో ఉంది. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఆ పరమ శివుడు కొలువై ఉన్నాడు. ఆ మహ శివుడు పూజాలందుకుంటున్న ఉన్న ఈ ఆలయాన్ని ‘మండూక మందిరం’ అని పిలుస్తారు. ఇక్కడ వెలసిన శివుడు కప్ప వెనుక కూర్చున్నాడని చెబుతారు. ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం…
సుమారు 200 సంవత్సరాల పురాతనమైన ఈ కప్ప దేవాలయం కరువు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించడానికి నిర్మించబడిందని చెబుతారు. కప్ప గుడిలోని శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివలింగం ఎప్పటికప్పుడు రంగు మారుతూ ఉంటుంది. మరెక్కడా చూడని విధంగా నంది విగ్రహం ఇక్కడ ప్రత్యేకించి ఉంటుంది. అన్ని ఆలయాలలో నంది కూర్చున్న విగ్రహాలు కనిపిస్తాయి. కానీ, ఇక్కడ నంది నిలబడినటువంటి విగ్రహం కనిపిస్తుంది. భక్తుల కష్టాలను తొలగించి, దుఃఖాన్ని నిర్మూలిస్తుంది. దారిద్య్ర విముక్తి కలిగించి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. పిల్లలు లేని వారికి. సంతాన సౌభాగ్యం వంటి శుభాలను ప్రసాదించే ఆలయం ఇది. దీపావళి, శివరాత్రి, శ్రావణ సోమవారాల్లో భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
పురాణాల ప్రకారం.. బఖత్ సింగ్ అనే రాజు ఒక కప్ప నుండి వరం పొందాడు. దాంతో అతను జీవితంలో ఎంతో అభివృద్ధిని సాధించాడట. కాబట్టి, అతను ఆ దివ్య కప్ప గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఆలయ నిర్మాణాన్ని కపిల తాంత్రికుడు చేపట్టాడు. పూర్తిగా తాంత్రికతపై ఆధారపడిన ఈ ఆలయ నిర్మాణం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం దాని ప్రత్యేక శైలి కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కప్ప గుడికి దీపావళితో పాటు మహా శివరాత్రి రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
లఖింపూర్ నుండి 11 కి.మీ దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా లఖింపూర్ చేరుకోవాలి. అక్కడ్నుంచి టాక్సీని లో కప్ప ఆలయానికి చేరుకోవచ్చు. మీరు విమానంలో రావాలను కుంటే 135 కి.మీ దూరంలో లక్నో విమానాశ్రయం ఉంటుంది. ఇక్కడ నుండి లఖింపూర్‌కు యూపీఎస్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. తిరిగి అక్కడి నుంచి టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..