- Telugu News Photo Gallery Is it good to keep parrots at home according to Vastu Shastra? check here is details in Telugu
Parrots Vastu Tips: ఇంట్లో రామ చిలుకలను పెంచుకుంటే ఏం జరుగుతుందంటే..
ఏదైనా ఒక పని చేస్తే.. ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది వాస్తు శాస్త్రం బాగా వివరించింది. ఒక వ్యక్తి పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి, ప్రశాంతంగా ఉండటానికి వాస్తు శాస్త్రం ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఇప్పటికే వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి పనులు చేయవచ్చో.. చేయకూడదో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రాకరం ఇంట్లో రామ చిలుకలను పెంచుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. రామ చిలుకలు అంటే చాలా మందికి ఇష్టం. చూడటానికి..
Updated on: Aug 02, 2024 | 7:11 PM

ఏదైనా ఒక పని చేస్తే.. ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది వాస్తు శాస్త్రం బాగా వివరించింది. ఒక వ్యక్తి పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి, ప్రశాంతంగా ఉండటానికి వాస్తు శాస్త్రం ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఇప్పటికే వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి పనులు చేయవచ్చో.. చేయకూడదో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రామ చిలుకలను పెంచుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

రామ చిలుకలు అంటే చాలా మందికి ఇష్టం. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. రామ చిలుకల్లో కొన్ని మాట్లాడుతూ ఉంటాయి కూడా. అందుకు చాలా మంది వీటిని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు. రామ చిలుకలను ఇంటికి తీసుకొచ్చా.. ఉత్తర దివల్ల ఉంచాలి.

నిజానికి రామ చిలుకలను బోనులో బంధించడం అస్సలు మంచిది కాదు. అవి స్వేచ్ఛగా ఉండేలా చూసుకోవాలి. ఒక వేళ కుదరక బోనులో పెంచినా అవి సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే శుభ ఫలితాలు మీకు కలుగుతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం రామ చిలుకలు ఇంట్లో సంతోషంగా ఉంటే.. మీ ఇల్లు సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇంట్లో చికాకుకులు, గొడవలు, భేదాభిప్రాయాలు తగ్గుతాయి.

ఇంట్లో రామ చిలుకను పెంచుకోకపోయినా.. చిలుక బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా చాలా శుభమని వాస్తు శాస్త్రం వివరిస్తోంది. ఇంట్లో రామ చిలుకల బొమ్మలు ఉంటే కేతువు, శని దుష్ట దృష్టి తగ్గుతాయని చాలా మంది నమ్ముతారు.





























