అత్తి పండ్లలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర నీటిని తాగడం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. అంటున్నారు నిపుణులు. రోజూ అంజీర్ నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య ఉండదు. అంజీర్ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.