- Telugu News Photo Gallery Acharya Chanakya Niti if wife has these qualities husband will become rich
Chanakya Niti: భార్యలో ఈ లక్షణాలు ఉంటే భర్త ధనవంతుడు అవుతాడట.. ఇల్లు స్వర్గంలా మారుతుందట..
ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రంలో బోధించాడు.. అనేక అంశాలను, సమస్యలను ప్రస్తావించడంతోపాటు.. వాటి తగినట్లుగా పరిష్కారాల గురించి కూడా వివరించాడు. అందుకే.. చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ ఉపయోగపడుతుంటాయి..
Updated on: Aug 03, 2024 | 3:57 PM

ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రంలో బోధించాడు.. అనేక అంశాలను, సమస్యలను ప్రస్తావించడంతోపాటు.. వాటి తగినట్లుగా పరిష్కారాల గురించి కూడా వివరించాడు. అందుకే.. చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ ఉపయోగపడుతుంటాయి.. చాలామంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు చాణక్య నీతిని ఇప్పటికీ పాటిస్తుంటారు.. వైవాహిక జీవితం, వృత్తి, ఆరోగ్యం, మానవ, ఉద్యోగానికి సంబంధించిన అనేక విషయాలు నీతి శాస్త్రంలో చాణక్యుడు వివరించాడు.. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవడంతోపాటు ఉన్నత స్థానానికి అధిగమించవచ్చని చాటిచెప్పాడు..

అయితే.. కొన్ని లక్షణాలు మనిషిని పతనం అంచుకుతీసుకెళ్తాయని.. పుట్టుకతో వచ్చే కొన్ని లక్షణాలు విజయం వైపునకు తీసుకెళ్తాయని ఆచార్య చాణక్యుడు విపులంగా వివరించాడు.. పురుషులు, మహిళల జీవితం గురించి... వైవాహిక జీవితం తర్వాత పరిస్థితుల గురించి ఆనాడే అంచనావేశాడు.. వైవాహిక జీవితంలో పురుషుడికి స్త్రీ వెన్నముకగా ఉంటే.. ఎన్నో సమస్యలతో పోరాడవచ్చని వివరించాడు..

అయితే.. కుటుంబాన్ని సమిష్టిగా ఉంచడంలో స్త్రీలది ముఖ్యపాత్ర.. పురుషుడికి స్త్రీల మద్దతు ఉంటే ఆ ఇల్లు స్వర్గంగా మారుతుంది. అదేవిధంగా, చాణక్యుడు దీనికి సంబంధించిన నైతికత గురించి ప్రస్తావించాడు.. స్త్రీ పురుషుల స్వభావం ఎలా ఉండాలి? ఇక్కడ పేర్కొన్న కొన్ని లక్షణాలను కలిగి ఉన్న స్త్రీలను ఎప్పుడూ వదులుకోవద్దని చాణక్యుడు పురుషులకు సలహా ఇచ్చాడు.. అవేంటో చూడండి..

Telugu Chanakya Niti

అసూయ లేని స్త్రీలు కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని.. కుటుంబంలో అందరినీ ప్రేమించే మహిళే కుటుంబానికి గొప్ప బలమని.. నాణ్యమైన ఆలోచనలు ఉన్నవారెవరూ కుటుంబానికి దూరంగా ఉండలేరన్నారు చాణక్యుడు. ఆమె తన భర్త, పిల్లలను చాలా ప్రేమిస్తుంది. తన కుటుంబాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటే.. ఆ ఇల్లు స్వర్గంలా మారుతుందని.. సిరిసంపదలు వస్తాయని.. చాణక్యుడు నీతిశాస్త్రంలో తెలిపాడు. ఇలాంటి లక్షణాలున్న మహిళ భాగస్వామిగా లభిస్తే.. అలాంటి పురుషులు ధనవంతులు అవుతారని చాణక్యుడు తెలిపాడు.




