రోజూ శరీరానికి అవసరమయ్యే డైట్ ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణు చెబుతున్నారు. విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడే అవసరమైన పోషకాలు అందుతాయి. బెర్రీలు, ఆకుకూరలు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయని, అలాంటి ఆహారాన్ని డైలీ డైట్‌లో చేర్చుకోవాలని చెబుతున్నారు.