అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే శ్రమ లేకుండా సన్నబడతారు..!

నిద్రపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ని సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే శ్రమ లేకుండా సన్నబడతారు..!
Weight Loss
Follow us

|

Updated on: Aug 01, 2024 | 9:24 PM

ఊబకాయం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్య. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు పెరగడాన్ని నియంత్రించడానికి ప్రజలు జిమ్‌లో గంటల తరబడి శ్రమిస్తున్నారు. డైట్‌ పేరుతో సగం కడుపుకే ఆహారం తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల ఉపయోగం లేదు. భోజనం మానేయడం, డైటింగ్ చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ, మనం తీసుకునే ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకోండి.

రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య దాదాపు 3 గంటల గ్యాప్ ఉండాలంటున్నారు నిపుణులు. రాత్రిపూట భోజనం చేయడం వల్ల జీర్ణం సరిగా జరగదు. దీంతో జీవక్రియ ప్రభావితం అవుతుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, సాయంత్రం త్వరగా తినడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే, రాత్రిపూట ఎల్లప్పుడూ లైట్‌ఫుడ్‌ తీసుకోవటం బెటర్‌ అంటున్నారు.

బరువు తగ్గడానికి డిన్నర్‌లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. రాత్రిపూట మీరు పచ్చి కూరగాయలు, సూప్, సలాడ్, పప్పు తినవచ్చు. మీకు అర్థరాత్రి ఆకలిగా అనిపిస్తే, కీర దోసకాయ లేదంటే యాపిల్‌ వంటి పండ్లను తినొచ్చు. మనం త్వరగా నిద్రపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ని సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఊబకాయం అనేది అటు నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. బరువు తగ్గడానికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. మీకు తగినంత నిద్ర లేకపోతే, అది మీ జీవక్రియను నెమ్మదిస్తుంది. దీంతో బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. ఇక మంచి నిద్ర కోసం రాత్రి పుకునే ముందు పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోంది. పసుపు పాలు బరువు తగ్గడానికి, మంచి నిద్రకు సహాయపడుతుంది. పసుపులో కొవ్వును కాల్చడానికి సహాయపడే థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. దీనితో పాటు, ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే శ్రమ లేకుండానే..
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే శ్రమ లేకుండానే..
మద్యం మత్తులో యువకుల రచ్చ..! బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి
మద్యం మత్తులో యువకుల రచ్చ..! బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి
రెండు రోజులపాటు ఏపీ జిల్లా కలెక్టర్ల కాన్ఫెరెన్స్
రెండు రోజులపాటు ఏపీ జిల్లా కలెక్టర్ల కాన్ఫెరెన్స్
నిర్మాతల మండలి కండీషన్స్‌.. స్టార్ హీరోలు పరేషాన్
నిర్మాతల మండలి కండీషన్స్‌.. స్టార్ హీరోలు పరేషాన్
నిన్న విశాల్‌కి.. నేడు ధనుష్‌కి.. నిర్మాతల మండలి బిగ్ ఝలక్‌
నిన్న విశాల్‌కి.. నేడు ధనుష్‌కి.. నిర్మాతల మండలి బిగ్ ఝలక్‌
రేవ్ పార్టీ రేంజ్‌లో బర్త్‌ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్‌
రేవ్ పార్టీ రేంజ్‌లో బర్త్‌ డే పార్టీ.. కట్ చేస్తే పోలీస్ కేస్‌
హాలీవుడ్ గడ్డపై బిగ్గెస్ట్ రికార్డ్‌
హాలీవుడ్ గడ్డపై బిగ్గెస్ట్ రికార్డ్‌
భారతీయుడు2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..అనుకున్న తేదీ కంటే ముందుగానే
భారతీయుడు2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..అనుకున్న తేదీ కంటే ముందుగానే
నా కెరీర్‌లో అవే అత్యంత బాధాకర క్షణాలు.. ధోని ఆసక్తికర వ్యాఖ్యలు.
నా కెరీర్‌లో అవే అత్యంత బాధాకర క్షణాలు.. ధోని ఆసక్తికర వ్యాఖ్యలు.
విరాట్‌పై నోరు జారిన శ్రీలంక అభిమాని.. వీడియో వైరల్
విరాట్‌పై నోరు జారిన శ్రీలంక అభిమాని.. వీడియో వైరల్