AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బియ్యం కడిగిన నీటిని జుట్టుకు వాడుతున్నారా..? ఏమవుతుందో తెలిస్తే..

కావాలంటే, మీరు రైస్ వాటర్ హెయిర్ స్ప్రేని కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టు మీద రక్షణ పొరను ఏర్పరుస్తుంది. దీంతో ఎటువంటి హానికరమైన పదార్థాలు మీ జుట్టును నేరుగా ప్రభావితం చేయవు. అలాగే, హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో అవిసె గింజల పొడి, బియ్యం పిండిని

బియ్యం కడిగిన నీటిని జుట్టుకు వాడుతున్నారా..? ఏమవుతుందో తెలిస్తే..
Rice Water For Hair
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2024 | 4:20 PM

Share

చాలామంది తమ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం సహజ పద్ధతులు, ఇంటి చిట్కాలపై ఆధారపడుతుంటారు. ఇందుకోసం ఇంట్లో లభించే సహజ పదార్ధాలనే ఉపయోగిస్తుంటారు. వీటిలో బియ్యం నీరు ప్రధానంగా చెప్పుకోవాలి. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బియ్యం కడిగిన నీరు జుట్టుకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అందుకే ఈ రోజు మనం బియ్యం కడిగిన నీటిని వినియోగం, కొన్ని ఉపయోగాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

వెంట్రుకల అందాన్ని పెంచడంలో బియ్యం కడిగిన నీరు ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. బియ్యంలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇనోసిటోల్‌ అనే ఒక కార్బోహైడ్రేట్‌ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ కార్పొహైడ్రేట్‌ సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జుట్టును బియ్యం కడిగిన నీళ్లతో వాష్‌ చేసుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నల్లగా మెరుస్తూ మృదువుగా మారుతుంది. ఇది మీ జుట్టు మూలాల్లో సరైన విటమిన్ల లోపాన్ని పూరిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లతో తలస్నానం చేయటం వల్ల చుండ్రు పోతుంది. తలపై ఉండే చిన్న చిన్న పొక్కులు వంటివి కూడా తగ్గిపోతాయి. జుట్టు నిగనిగలాడుతుంది.

జుట్టు పెరుగుదలలో బియ్యం నీరు పరోక్ష పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టుకు అదనపు మెరుపును అందిస్తుంది. కాబట్టి, మీరు మీ హెయిర్‌కేర్‌ రోటీన్‌లో కూడా ఈ బియ్యం కడిగిన నీటిని ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

కావాలంటే, మీరు రైస్ వాటర్ హెయిర్ స్ప్రేని కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది మీ జుట్టు మీద రక్షణ పొరను ఏర్పరుస్తుంది. కాబట్టి ఎటువంటి హానికరమైన పదార్థాలు మీ జుట్టును నేరుగా ప్రభావితం చేయవు. అలాగే, హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో అవిసె గింజల పొడి, బియ్యం పిండిని కలపండి. ఇందులో కొన్ని చెంచాల బియ్యం నీటిని కలపాలి. చిక్కటి మిశ్రమం తయారు చేసుకుని, జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. దీంతో మీరు మంచి ఫలితాలను పొందుతారు.

జుట్టును వాష్‌ చేయడానికి ఉపయోగించడం వల్ల కూడా ప్రభావం ఉంటుంది. ఇది మీ జుట్టు అందాన్ని కాపాడుకోవడానికి ఒక్క బియ్యం నీరే వందపాళ్లు ఉపయోగపడుతుంది. కాబట్టి, బియ్యం కడిగిన నీటిని జుట్టు మూలాల్లోకి పట్టించి స్మూత్‌గా మసాజ్ చేయండి. ఇది మీ జుట్టును అందంగా, మెరిసేలా చేస్తుంది. కానీ, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. మీకు మీ జుట్టుకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా, అందుకు చికిత్స తీసుకుంటున్నా ఇలాంటివి పాటించే ముందు వైద్యులను సంప్రదించటం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం