Wayanad Landslides: దేవభూమిలో మృత్యుఘోష.. వారికోసం రంగంలోకి ఆర్మీ జాగిలాలు
వయనాడ్ వరదల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఉళ్లు..చూరాల్‌మల, ముండక్కాయ్ గ్రామాలు. ఎగువన కొండల నుంచి రాత్రికి రాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తింది. అప్పటికే ఎడతెగని వర్షాలకు బాగా నానిపోయిన కొండచరియలు కూడా విరిగిపడడ్డాయి. ఆ రాళ్లు, వరద, బురద అంతా కింద ఉన్న ఊళ్లను ముంచెత్తింది. ఈ ప్రభావంతో ముండక్కాయ్ గ్రామం బురద మయంగా మారిపోయింది.
ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో శిక్షణ పొందిన ఆర్మీ శునకాలను కూడా రంగంలోకి దింపారు. బెల్జియన్ మాలినోయిస్, లాబ్రడార్, జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన స్నిఫర్ డాగ్‌లను తీసుకొచ్చారు. ఇవి మానవ అవశేషాలతోపాటు మట్టిలో కూరుకుపోయిన వారి శ్వాసను కూడా పసిగట్టగలవు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..