వార్నీ.. గుడ్డిగా టమాటాలు కోస్తే గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్‌..!? ఇండియన్‌ చెఫ్‌ ఇంతకు మించి చేయగలరంటూ..

ఈ వీడియోకు 60 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ వెల్లువెత్తాయి. ఇండియన్‌ కుక్‌లు ఇంతకంటే వేగంగా, ఇంకా సన్నగా కట్ చేయగలరంటూ ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ కామెంట్‌ చేశారు. మరొకరు స్పందిస్తూ..మా అమ్మ టమాటాలను ఇంతకంటే బాగా కట్ చేయగలదు అని రాశారు.

వార్నీ.. గుడ్డిగా టమాటాలు కోస్తే గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్‌..!? ఇండియన్‌ చెఫ్‌ ఇంతకు మించి చేయగలరంటూ..
Canadian Chef
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 01, 2024 | 2:59 PM

ఇంట్లో కత్తితో కూరగాయలు కోస్తుండగా చాలా మంది వారి చేతులు కూడా కట్‌ చేసుకుంటుంటారు. వారికి కూరగాయలు ఎలా కత్తిరించాలో తెలిసినప్పటికీ, అన్ని ముక్కలు ఒకే పరిమాణంలో కట్‌ చేయలేరు. కానీ, కెనడాకు చెందిన చెఫ్ వాలెస్ వాంగ్ మాత్రం కళ్లు మూసుకుని టమోటాలను పర్ఫెక్ట్‌గా కోసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలాగే టమాటా ముక్కలన్నీ ఒకే సైజులో ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని ఒక్క నిమిషంలో తొమ్మిది టమోటాలు కోశాడు. అతని నైపుణ్యాన్ని మెచ్చుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ అతనిని వరించింది. ఈ టామాటా కటింగ్ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

ఆ వీడియోలో, కెనడియన్ చెఫ్ కళ్లకు మాస్క్ కట్టుకుని ఉన్నాడు. టేబుల్ ముందు వెజిటేబుల్‌ కట్‌ చేసేందుకు కావాల్సిన బోర్డు మీద కొన్ని టమోటాలు కూడా ఉన్నాయి. అతనికి టైమ్‌ చెప్పగానే చేతిలోని కత్తితో టమాటాలన్నీ ఒక్కొక్కటిగా ఒకే పరిమాణంలోకి కట్‌ చేశాడు. ఈ విధంగా ఆ యువకుడు 1 నిమిషంలో 9 టమోటాలు కట్ చేశాడు. అక్కడే ఉన్న లేడీ జడ్జ్‌ అతని పనిని నిశితంగా గమనిస్తోంది. 1 నిమిషం చివరలో అతను 4 టమోటాలు ఎక్కువగా కట్‌చేశాడు..కానీ,ఆ టమాటా ముక్కలన్నీ ఒకే సైజులో లేవు. కానీ, అతనికి ఇచ్చిన టైమ్‌లోపల కట్‌ చేసిన టమాటాలను అతడు పర్ఫెక్ట్‌గా కోసినందుకు కెనడియన్ చెఫ్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ అందజేశారు.

ఇవి కూడా చదవండి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మార్గదర్శకాల ప్రకారం, ఈ టైటిల్ గెలవడానికి కళ్లకు గంతలు కట్టుకుని చూడకుండా అన్ని టమాటాలను ఎనిమిది సమాన భాగాలుగా కట్ చేయాలి. వాలెస్ వాంగ్ నాలుగు టమాటాలు తేడాగా కట్‌ చేసినప్పటికీ ఈ రికార్డును నెలకొల్పాడు. అతడు కళ్లకు గంతలు కట్టుకుని చూడకుండా టమోటాలు కోస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 60 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ వెల్లువెత్తాయి. ఇండియన్‌ కుక్‌లు ఇంతకంటే వేగంగా, ఇంకా సన్నగా కట్ చేయగలరంటూ ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ కామెంట్‌ చేశారు. మరొకరు స్పందిస్తూ..మా అమ్మ టమాటాలను ఇంతకంటే బాగా కట్ చేయగలదు అని రాశారు.

యాదృచ్ఛికంగా, ఇది మొదటి టైటిల్ కాదు. దీనికి ముందు, ఈ కెనడియన్ చెఫ్ వాలెస్ వాంగ్ గత సంవత్సరం దోసకాయలను కోసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను కళ్ళు మూసుకుని 30 సెకన్లలో 166 దోసకాయలను కట్‌ చేశాడు. దీని కోసం, వాలెస్ వాంగ్ ఫిబ్రవరి 6, 2023న ప్రపంచ రికార్డు టైటిల్‌ను గెలుచుకున్నాడు. క్యారెట్ కోసిన రికార్డు కూడా ఆయన సొంతం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..