Olympics: ‘నేనైతే ఆ షాట్ తప్పనే వాడిని’.. లక్ష్యసేన్ ఆటతీరుపై ఆనంద్ మహీంద్ర ఫన్నీ రియాక్షన్
ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టిపై 21-18, 21-12 తేడాతో విజయం సాధించి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే లక్ష్యసేన్ కనబరిచిన అద్భుత ఆటతీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అత్యంత చాకచక్యంతో వెనకాల నుంచి కొట్టిన షాట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ అంగరవంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచనలుమూలల నుంచి ఆటగాళ్లు, వాళ్లను సపోర్ట్ చేయడానికి వచ్చిన అభిమానులతో పారిస్ కళకళలాడుతోంది. ఇక ఒలింపిక్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు మంచి ఆరంభాన్నే మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత షట్లర్ లక్ష్యసేన్ ప్రీక్వార్ట్స్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రపంచ నెంబర్ 4 ర్యాంకర్ జొనాథన్ క్రిస్టిను అలవోకగా ఓడించాడు.
ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టిపై 21-18, 21-12 తేడాతో విజయం సాధించి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే లక్ష్యసేన్ కనబరిచిన అద్భుత ఆటతీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అత్యంత చాకచక్యంతో వెనకాల నుంచి కొట్టిన షాట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సైతం స్పందించారు.
లక్ష్య వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర ఫన్నీ కామెంట్ చేశారు. మూడు చేతులతో ఆడినట్లు ఉందని లక్ష్యపై ఆనంద్ అభినందల వర్షం కురిపించారు. అలాగే.. ‘ఒకవేళ నేనే కనుక అతడికి ప్రత్యర్థినై ఉంటే.. లక్ష్యసేన్ కొట్టిన షాట్ తప్పని మొరపెట్టుకొనేవాడిని. అంతేకాకుండా దావా వేసేవాడిని. మూడు చేతులు కలిగిన ప్రత్యర్థిని ఎదుర్కొన్నానని ఆరోపణలు చేసేవాడిని’ అని ఆనంద్ మహీంద్ర ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
If I was his opponent, I would cry foul & file a suit claiming that I was confronted by an unnatural opponent who possessed three arms…
😳
👍🏽💪🏽🇮🇳pic.twitter.com/4p5EsPNxyV
— anand mahindra (@anandmahindra) July 31, 2024
ఇదిలా ఉంటే జొనాథన్‌తో పోటీపడడంపై స్పందించిన లక్ష్యసేన్.. తాను ఇప్పటి వరకు తాను ఎదుర్కొన్న కఠిన ప్రత్యర్థుల్లో జొనాథన్ ఒకరని చెప్పుకొచ్చాడు. ఇది అత్యంత క్లిష్టమైన మ్యాచ్ అని, ప్రస్తుతం దృష్టంతా గోల్డ్ మెడల్ సాధించడంపైనే ఉందని చెప్పుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..