మామిడి నర్సరీలోకి దూరిన దొంగలు ఏమి చేశారో చూడండి
తాళం వేసి ఉన్న ఇళ్ళల్లోనో, బ్యాంక్ లోనో, అనేక రకాల దొంగతనాలు గురించి తెలుసు. కానీ, ఓ మామిడి నర్సరీలో ఉన్న మోటార్ ను ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం, జమ్ముగూడెంలో జరిగిందీ ఘటన. గ్రామంలో గోపి అనే వ్యక్తి మామిడి మొక్కల నర్సరీని ఏర్పాటు చేసుకొని మొక్కలు ఎగుమతి చేస్తుంటాడు.
తాళం వేసి ఉన్న ఇళ్ళల్లోనో, బ్యాంక్ లోనో, అనేక రకాల దొంగతనాలు గురించి తెలుసు. కానీ, ఓ మామిడి నర్సరీలో ఉన్న మోటార్ ను ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం, జమ్ముగూడెంలో జరిగిందీ ఘటన. గ్రామంలో గోపి అనే వ్యక్తి మామిడి మొక్కల నర్సరీని ఏర్పాటు చేసుకొని మొక్కలు ఎగుమతి చేస్తుంటాడు. అయితే ఆ మొక్కల ఖరీదు ఎక్కువుగా ఉండటం, చుట్టుపక్కల జన సంచారం తక్కువుగా ఉండటం.. గత కొద్ది నెలలుగా అశ్వారావుపేట పరిసర ప్రాంతంలొని పొలాల్లో, తోటల్లో మోటార్లు చోరీకి గురి అవుతుండటంతో నర్సరీ యజమాని గోపి తన మామిడి నర్సరీలో ముందు జాగ్రత్తగా సి.సి కెమెరాలు ఏర్పాటు చేశాడు. సి.సి కెమెరాలు ఉన్న విషయం తెలియని దొంగలు నర్సరీలోకి ప్రవేశించి ఎంతో దర్జాగా, అదేదో తమ సొంత నర్సరీలో మోటార్ చెడిపోయినట్లు ఆ మోటార్ కు విద్యుత్ కనెక్షన్ తొలగించి, మోటార్‌తో ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఆలస్యంగా నర్సరీకు వచ్చిన యజమాని విద్యుత్ వైర్లు కత్తిరించి ఉండటంతో అక్కడ ఉండవలసిన మోటార్ లేకపోవటంతో అనుమానం వచ్చింది. వెంటనే సి.సి కెమెరాలో చూడగా ఇద్దరు వ్యక్తులు మోటార్ ను దొంగిలించిన దృశ్యాలు వెలుగుచూశాయి. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. అంతే కాకుండా ఈ మోటార్ దొంగలను గుర్తించాలని,సోషల్ మీడియాలో కూడా పెట్టడంతో ఈ దొంగతనం దృశ్యాలు వైరల్ అయ్యాయి,పోలీసులు వీరిని పట్టుకొనే పనిలో నిమగ్నం అయ్యారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్ రికార్డ్ ఎలా సాధ్యమైందంటే !!
ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు
టూ వీలర్ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

