వందేభారత్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు
వందేభారత్ రైల్లో అనూహ్య ఘటన చోటు చేసుకొంది. భోజనం అందించిన సిబ్బందిపై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. శాకాహారి అయిన ఆయనకు మాంసాహార భోజనం అందించడమే అందుకు కారణం. ఇటీవల ఓ పెద్దాయన పశ్చిమబెంగాల్‌లోని హావ్‌డా నుంచి రాంచీకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. భోజనం వేళ థాలీని ఆర్డర్ చేశాడు. అయితే.. సిబ్బందిలో ఒకరు పొరబాటున మాంసాహారాన్ని వడ్డించారు.
వందేభారత్ రైల్లో అనూహ్య ఘటన చోటు చేసుకొంది. భోజనం అందించిన సిబ్బందిపై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. శాకాహారి అయిన ఆయనకు మాంసాహార భోజనం అందించడమే అందుకు కారణం. ఇటీవల ఓ పెద్దాయన పశ్చిమబెంగాల్‌లోని హావ్‌డా నుంచి రాంచీకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. భోజనం వేళ థాలీని ఆర్డర్ చేశాడు. అయితే.. సిబ్బందిలో ఒకరు పొరబాటున మాంసాహారాన్ని వడ్డించారు. కాసేపటికి అది నాన్ వెజ్ అని గుర్తించాడు. తనకు మాంసాహారాన్ని వడ్డించాడని వెయిటర్‌పై దాడికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. ‘‘తప్పు జరిగింది. కానీ, అలా దాడికి దిగడం ఆమోదయోగ్యం కాదు’’.. ‘‘ఆహారం విషయంలో సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సింది’’.. ‘‘ఏది ఏమైనప్పటికీ ఆ ప్రయాణికుడు చేసింది తప్పే’’ అంటూ కామెంట్లు పోస్టు చేశారు. ఈ ఘటనపై తూర్పు రైల్వేశాఖ స్పందించింది. ‘‘పొరబాటు జరిగింది. సమస్యను పరిష్కరించాం’’ అని ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్ రియాక్షన్ ఇదే
అలాంటివారితో వాదించడం వేస్ట్.. నయన్ ఘాటు రిప్లై
మరో 18 యూ ట్యూబ్ ఛానళ్లపై బ్యాన్.. మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు..
నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం.. దేవుడి మహిమే నంటూ భక్తులు పూజలు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

