మరో 18 యూ ట్యూబ్ ఛానళ్లపై బ్యాన్.. మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు..
అసత్య వార్తలను ప్రచారం చేస్తోన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇటీవల రద్దు చేసింది. హీరోహీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై నటి మీనా స్పందించారు. మంచు విష్ణుకు థ్యాంక్స్ చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
అసత్య వార్తలను ప్రచారం చేస్తోన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇటీవల రద్దు చేసింది. హీరోహీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై నటి మీనా స్పందించారు. మంచు విష్ణుకు థ్యాంక్స్ చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. మా తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేసిన మీనా తప్పుడు కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ ఛానళ్లపై యాక్షన్ తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు, అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ సమగ్రతను కాపాడటంలో మీరు చూపుతోన్న అంకితభావం నిజంగా అభినందనీయం. నటీనటులు ఈ విషయంలో ఎన్నో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెగెటివ్ కామెంట్స్‌ను ఎదిరించడంలో, మన సంఘాన్ని కాపాడడంలో అందరం కలిసి ముందుకు వెళ్లాలి. ఈ విషయంలో మీరు నిరంతరం మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను. మంచు విష్ణు.. చాలా మంచి పనిచేశారు’ అని పేర్కొన్నారు. గతంలో మీనా వ్యక్తిగత విషయాలపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇష్టానుసారంగా వార్తలు రాయగా ఆమె స్వయంగా వాటిని ఖండించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం.. దేవుడి మహిమే నంటూ భక్తులు పూజలు
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

