నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం.. దేవుడి మహిమే నంటూ భక్తులు పూజలు
త్వరలో శ్రావణమాసం రాబోతోంది. ఇక శ్రావణ శుద్ధ పంచమిని శ్రీ పంచమి, నాగపంచమిగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఆ రోజు నాగదేవతను ఆరాధిస్తారు. అయితే పెద్దపల్లి జిల్లాలోని ఓ శివాలయంలో నాగదేవత ప్రత్యక్షమైందని భక్తులు పూజలు చేశారు. ఎందుకంటే అక్కడి శివాలయంలోని నాగదేవత విగ్రహంపై నాగుపాము పడగ విప్పి కూర్చుంది. ఈ వింతను చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో ఆలయానికి పోటెత్తారు.
త్వరలో శ్రావణమాసం రాబోతోంది. ఇక శ్రావణ శుద్ధ పంచమిని శ్రీ పంచమి, నాగపంచమిగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఆ రోజు నాగదేవతను ఆరాధిస్తారు. అయితే పెద్దపల్లి జిల్లాలోని ఓ శివాలయంలో నాగదేవత ప్రత్యక్షమైందని భక్తులు పూజలు చేశారు. ఎందుకంటే అక్కడి శివాలయంలోని నాగదేవత విగ్రహంపై నాగుపాము పడగ విప్పి కూర్చుంది. ఈ వింతను చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో ఆలయానికి పోటెత్తారు.పెద్దపల్లి జిల్లా ఓదెల లో లోని శ్రీ పార్వతి శంభు లింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పై పడగ విప్పింది.. ఈ విగ్రహం పై నుంచి కింది వరకు వెళ్ళింది.అంతే కాకుండా నాగ దేవత విగ్రహం పై పడగ విప్పి..సాక్షాత్తు నాగదేవతే ప్రత్యక్షమైందా అన్నట్టుగా దర్శనమిచ్చింది. పడగ తోనే విగ్రహం పై నిలబడింది..నిజానికి ఇలాంటి దృశ్యాలు సినిమా లో చూస్తుంటాం. విగ్రహం పై నాగుం పాము పడగ విప్పడం తో.. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు శివుడి మహిమ అంటూ ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి తిలకించారు. ఎంతమంది వచ్చినా ఆ పాము అక్కడి నుంచి కదలలేదు. భక్తులు వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయినా పాము వెళ్లలేదు సరికదా ఆ విగ్రహానికి అల్లుకొని అలాగే ఉంది. పాము ఎంతకు వెళ్ళకపోవడంతో స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో పామును పట్టుకొని దూర ప్రాంతంలో వదిలిపెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

