మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్‌ రియాక్షన్ ఇదే

మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్‌ రియాక్షన్ ఇదే

Phani CH

|

Updated on: Aug 01, 2024 | 1:50 PM

మెగా ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయా? అనే ప్రచారంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ స్పందించారు. ‘ఉషా పరిణయం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సాయితేజ్‌ తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. ‘‘నా సినిమాలో ‘నో పెళ్లి’ (సోలో బ్రతుకే సో బెటర్‌) అనే పాట ఉంది తెలుసు కదా’’ అని సమాధానం ఇచ్చారు. వెంటనే యాంకర్‌ ‘మీ లవ్‌ గురించి చెప్పండి’ అని అడగ్గానే.. ‘‘వన్‌సైడ్‌ లవ్‌ ఉంది.

మెగా ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయా? అనే ప్రచారంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ స్పందించారు. ‘ఉషా పరిణయం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సాయితేజ్‌ తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. ‘‘నా సినిమాలో ‘నో పెళ్లి’ (సోలో బ్రతుకే సో బెటర్‌) అనే పాట ఉంది తెలుసు కదా’’ అని సమాధానం ఇచ్చారు. వెంటనే యాంకర్‌ ‘మీ లవ్‌ గురించి చెప్పండి’ అని అడగ్గానే.. ‘‘వన్‌సైడ్‌ లవ్‌ ఉంది. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి.. మాట్లాడేలోపు ‘మీకు పెళ్లి అయిపోయిందట కదా’ అనే సమాధానం వస్తోంది. నాకు పెళ్లా? అని నేను ఆశ్చర్యపోతే.. మీడియాలో చూశామంటున్నారు’’ అని రిప్లయ్‌ ఇచ్చాడు. ఇక ఏపీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించిన రోజు ఆయనను ఎత్తుకోవడంపై సాయి తేజ్‌ స్పందిస్తూ.. ‘‘బాల్యంలో నేను ఓ టోర్నమెంట్‌లో ఓడిపోయి, చాలా బాధపడుతూ ఇంటికొచ్చాను. అప్పుడు మామయ్య ‘ఒక్కసారే కాదురా నువ్వు పది సార్లు ఓడినా ఫర్వాలేదు కానీ, ఆట బాగా ఆడాలి’ అని చెప్పారు. ఆయన ప్రోత్సాహంతో తర్వాత విన్‌ అయ్యా. నేను గెలిచిన రోజు ఆయన ఎలా ఆనందించారో.. ఆయన గెలుపును నేనూ అలా ఎంజాయ్‌ చేశా’’ అని చెప్పుకొచ్చారు. దర్శకుడు కె.విజయ్‌ భాస్కర్‌ తన కుమారుడు శ్రీకమల్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం ఉషా పరిణయం.. ఈ మూవీ ఆగస్టు 2న విడుదల కానుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలాంటివారితో వాదించడం వేస్ట్‌.. నయన్‌ ఘాటు రిప్లై

మరో 18 యూ ట్యూబ్‌ ఛానళ్లపై బ్యాన్.. మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు..

నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం.. దేవుడి మహిమే నంటూ భక్తులు పూజలు

ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ మహేష్‌ బాబు పోస్ట్‌