అలాంటివారితో వాదించడం వేస్ట్‌.. నయన్‌ ఘాటు రిప్లై

అలాంటివారితో వాదించడం వేస్ట్‌.. నయన్‌ ఘాటు రిప్లై

Phani CH

|

Updated on: Aug 01, 2024 | 1:49 PM

మందారపువ్వు టీ తాగి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ప్రముఖ నటి నయనతారపై ఓ వైద్యుడు విరుచుకు పడ్డాడు. ఆ వైద్యుడు మరెవరో కాదు.. ఇటీవల సమంతను విమర్శించిన డాక్టరే. ది లివర్ డాక్టర్ అనే ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు పెట్టారు. మందారపువ్వుపై ఆమె తనకున్న 8.7 మిలియన్ల ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మందారపువ్వు టీ తాగి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ప్రముఖ నటి నయనతారపై ఓ వైద్యుడు విరుచుకు పడ్డాడు. ఆ వైద్యుడు మరెవరో కాదు.. ఇటీవల సమంతను విమర్శించిన డాక్టరే. ది లివర్ డాక్టర్ అనే ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు పెట్టారు. మందారపువ్వుపై ఆమె తనకున్న 8.7 మిలియన్ల ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సమంత తన ఫాలోవర్లను తప్పుదారి పట్టించిన దానికంటే రెండు రెట్లు ఎక్కువగా నయనతార ఆ పని చేస్తోందని మండిపడ్డారు. మందారపువ్వు టీ బాగుంటుందని చెప్పి వదిలేసి ఉంటే అయిపోయేదని, కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్పి తన మిడిమిడి జ్ఞానాన్ని జనాలకు కూడా పంచుతున్నారని ఫైరయ్యారు. మందారపువ్వు డయాబెటిస్, హైబీపీ, యాక్నే, యాంటీ బ్యాక్టీరియల్ అంటూ నయనతార చెబుతున్నారని, ఆమె చెప్పిన వాటికి ప్రూఫ్స్ లేవని పేర్కొంటూ, నయనతార పోస్టు ఫొటోలను షేర్ చేశారు. వైద్యుడి విమర్శలపై స్పందించిన నయనతార.. తెలివి తక్కువ వారితో వాదించవద్దు. ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకెళ్లి ఓడిస్తారు.. అని అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ సూక్తిని షేర్ చేశారు. అయితే, ఇందులో నేరుగా వైద్యుడిని ప్రస్తావించనప్పటికీ ఆయనను ఉద్దేశించే నయన్ ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. కాగా ఇటీవల నయన్‌ తనకు మందారపువ్వు టీ అంటే చాలా ఇష్టమని తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరో 18 యూ ట్యూబ్‌ ఛానళ్లపై బ్యాన్.. మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు..

నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం.. దేవుడి మహిమే నంటూ భక్తులు పూజలు

ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ మహేష్‌ బాబు పోస్ట్‌