టూ వీలర్‌ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం

టూ వీలర్‌ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం

Phani CH

|

Updated on: Aug 01, 2024 | 1:53 PM

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువచ్చింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగే కాదు.. ఒక్కోసారి ద్విచక్రవాహనంలో ప్రయాణించేటప్పుడు వెనుక కూర్చొన్న వ్యక్తితో మాట్లాడటం కూడా ప్రమాదాలకు దారి తీస్తుందని భావించిన ప్రభుత్వం.. ఓ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై డ్రైవింగ్‌ సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువచ్చింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగే కాదు.. ఒక్కోసారి ద్విచక్రవాహనంలో ప్రయాణించేటప్పుడు వెనుక కూర్చొన్న వ్యక్తితో మాట్లాడటం కూడా ప్రమాదాలకు దారి తీస్తుందని భావించిన ప్రభుత్వం.. ఓ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై డ్రైవింగ్‌ సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నిబంధన అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు వర్తిస్తుంది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. పదే పదే ఈ నేరం పునరావృతమైతే తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మాట్లాడుతున్న విషయం చోదకుడిని పరధ్యానంలో పడేసే ప్రమాదం ఉంటుంది. దాంతో రోడ్డుపై నుంచి దృష్టిని మళ్లిస్తుంది. ఫలితంగా ప్రమాదాలకు దారి తీయొచ్చు. అందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఈ రూల్‌ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. రహదారి భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను ప్రవేశ పెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేభారత్‌ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు

మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్‌ రియాక్షన్ ఇదే

అలాంటివారితో వాదించడం వేస్ట్‌.. నయన్‌ ఘాటు రిప్లై

మరో 18 యూ ట్యూబ్‌ ఛానళ్లపై బ్యాన్.. మంచు విష్ణుపై నటి మీనా ప్రశంసలు..

నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం.. దేవుడి మహిమే నంటూ భక్తులు పూజలు