84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్‌ రికార్డ్‌ ఎలా సాధ్యమైందంటే !!

84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్‌ రికార్డ్‌ ఎలా సాధ్యమైందంటే !!

Phani CH

|

Updated on: Aug 01, 2024 | 1:56 PM

ఎవరైనా ఒక సంస్థలో ఎన్నేళ్లు పనిచేస్తారు. మహా అయితే మూడు నాలుగేళ్లు చేస్తారు. ఆ తర్వాత జీతం పెరుగుతుందనో, మరో కారణంతోనో కంపెనీ మారుతుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 84 ఏళ్లు ఒకే కంపెనీలో పనిచేసి ఆ సంస్థ పేరునే తన పేరుగా గుర్తింపు పొందాడు. అంతేకాదు, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇటీవలే అతను తన 101వ పుట్టినరోజు వేడుకలను తన సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వైభవంగా జరుపుకున్నాడు.

ఎవరైనా ఒక సంస్థలో ఎన్నేళ్లు పనిచేస్తారు. మహా అయితే మూడు నాలుగేళ్లు చేస్తారు. ఆ తర్వాత జీతం పెరుగుతుందనో, మరో కారణంతోనో కంపెనీ మారుతుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 84 ఏళ్లు ఒకే కంపెనీలో పనిచేసి ఆ సంస్థ పేరునే తన పేరుగా గుర్తింపు పొందాడు. అంతేకాదు, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇటీవలే అతను తన 101వ పుట్టినరోజు వేడుకలను తన సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వైభవంగా జరుపుకున్నాడు. ఇది 2022 నాటి ఘటనే అయినా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. బ్రెజిల్‌కు చెందిన వాల్టర్‌ ఆర్థ్‌మ్యాన్‌ ఒకే కంపెనీలో 84 ఏళ్ళు పని చేసి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. వాల్డర్‌, శాంటా కాటరినాలోని ఇండస్ట్రియాస్‌ రెనోక్స్‌ కంపెనీలో 1938 జనవరి 17న తన 15 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరారు. ఈ టెక్స్‌టైల్‌ కంపెనీలో షిప్పింగ్‌ అసిస్టెంట్‌గా చేరిన ఆయన అనతికాలంలోనే కంపెనీ సేల్స్‌ మేనేజర్‌గా ఎదిగారు. వాల్టర్‌..బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని బ్రస్క్యూ అనే చిన్న పట్టణంలో జన్మించారు. వాల్టర్‌ ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపేవారు. అద్భుతమైన జ్ఞాపకశక్తి వాల్టర్‌ సొంతం. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎండ, వాన లెక్క చేయకుండా శ్రద్ధగా చదువుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు

టూ వీలర్‌ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం

వందేభారత్‌ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు

మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్‌ రియాక్షన్ ఇదే

అలాంటివారితో వాదించడం వేస్ట్‌.. నయన్‌ ఘాటు రిప్లై