Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే.. పుట్టెడు లాభాలు
సన్‌ఫ్లవర్ విత్తనాలు తింటే ఎన్ని లాభాలో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పొద్దుతిరుగుడు పువ్వులోని గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఈ, మెగ్నీషియం, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ అధికంగా లభిస్తుంది. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని రోజుకు ఒక స్పూను తీసుకోవడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jul 31, 2024 | 9:49 PM

పొద్దుతిరుగుదు విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది చెడు కొవ్వును కరిగించి గుండెకు మేలు చేకూర్చుతుంది. విటమిన్ ఈ అనేది ఒక పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలు పాడుకాకుండా చూస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూస్తుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడంలో సన్‌ఫ్లవర్ విత్తనాలు చక్కగా పని చేస్తాయి. ఇందులోని సెలీనియం రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు దరి చేరవు. చర్మ ఆరోగ్యం సన్‌ఫ్లవర్ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సన్‌ఫ్లవర్ విత్తనాలు లోపలి నుంచి మాయిశ్చరైజింగ్‌ను అందిస్తాయి.

సన్‌ఫ్లవర్ విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణం వేగంగా అవుతుంది. మలబద్ధకం సమస్య దరి చేరకుండా ఉంటుంది. డయాబెటిస్ కంట్రోల్‌డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది. సన్‌ఫ్లవర్ విత్తనాలను తీసుకోవడంతో రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో మధుమేహం సమస్య రాదు.

సన్‌ఫ్లవర్ విత్తనాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చుతుంది. సన్‌ఫ్లవర్ విత్తనాలు తింటే ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే విటమిన్ బి6… మానసిక స్థితి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలలో నియాసిన్, విటమిన్ ఇ, బి 1, బి 6, ఇనుము, రాగి, మాంగనీస్, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో కనిపించే బీటా-సిటోస్టెరాస్, బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రొమ్ము క్యాన్సర్ తో సహా వివిధ క్యాన్సర్లను రాకుండా నిరోధిస్తాయి.





























