Sea Cucumber: సముద్ర దోసకాయ.. దొరికితే కోటీశ్వరులే! అంతర్జాతీయ స్మగ్లర్ల టార్గెట్ ఇదే!
ఆరోగ్యానికి మేలు చేసే పండ్ల ధరలు సాధారణంగా వందల్లో ఉంటాయి. కానీ, భారతదేశంలో లభించే ఒక ప్రత్యేకమైన జీవి విలువ లక్షలు పలుకుతుంది. అందుకే దీనిని కొనుగోలు చేయడం ఒక సాధారణ వ్యక్తి కలలో కూడా ఊహించలేడు. అదే సముద్ర దోసకాయ (Sea Cucumber).ఇదిప్పుడు అంతర్జాతీయ స్మగ్లర్లకు టార్గెట్ గా మారింది. దీనిని ఏం చేస్తారో తెలుసా?..

సాధారణంగా మనం తినే దోసకాయ చవకగా, ఆరోగ్యకరంగా లభిస్తుంది. కానీ, భారతదేశంలో ఒక ప్రత్యేకమైన ‘దోసకాయ’ లభిస్తుంది, దీని ధర వింటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఇది కూరగాయ కాదు, సముద్రంలో నివసించే ఒక విచిత్రమైన జీవి. దీనిని సముద్ర దోసకాయ (Sea Cucumber) అని పిలుస్తారు. ఈ అరుదైన జీవి విలువ లక్షల్లో ఉంటుంది. అందుకే, అంతరించిపోతున్న ఈ జాతిని అంతర్జాతీయ మార్కెట్‌కు అక్రమంగా రవాణా చేస్తుంటారు. భారతదేశంలో దొరికే ఈ ప్రత్యేకమైన సముద్ర జీవి, దాని అక్రమ రవాణా గురించి వివరాలు తెలుసుకుందాం.
అంతర్జాతీయ స్మగ్లింగ్ కారణం:
సముద్ర దోసకాయలు అంత ఖరీదైనవిగా ఉండటానికి కారణం, అంతర్జాతీయంగా వీటిని ఔషధాల తయారీకి, కొన్ని దేశాల్లో ఆహారంగా ఉపయోగిస్తారు. వీటి అరుదైన లక్షణాలు, అధిక విలువ కారణంగా ఈ జీవులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.
అక్రమ రవాణా మార్గాలు:
ఈ ప్రత్యేకమైన సముద్ర జీవిని భారత జలాల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేస్తారు. ముఖ్యంగా తమిళనాడులోని దక్షిణ భారత ప్రాంతం నుండి శ్రీలంకకు సముద్ర దోసకాయలను భారీగా తరలిస్తారు. అంతరించిపోతున్న జాతులైన సముద్ర దోసకాయల స్మగ్లర్లు తరచుగా పట్టుబడటం చూస్తున్నాం.
ఈ సముద్ర జీవిని స్థానికంగా ఖుర్ది అనే పేరుతో పిలుస్తారు. వీటిని అక్రమంగా రవాణా చేస్తుంటే లక్షలాది రూపాయల విలువైనవిగా లెక్కకడతారు. వజ్రాల కంటే ఎక్కువ ధర పలికే ఈ జీవిని సంరక్షించడం పర్యావరణ పరిరక్షణకు చాలా అవసరం.




