AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kilometer Stone: కిలోమీటర్ రాయి రంగుల్లో కోడ్ ఇదే! ఇది తెలిస్తే ఎప్పటికీ దారితప్పరు..

మనం రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు దూరాలను చెప్పే కిలోమీటర్ రాళ్లను చూస్తూనే ఉంటాం. కానీ, మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని రాళ్లు పసుపు రంగులో ఉంటే, మరికొన్ని ఆకుపచ్చ, ఆరెంజ్ రంగులలో ఉంటాయి. ఈ రంగుల మధ్య ఏదైనా రహస్యం ఉందా? ఖచ్చితంగా ఉంది! కిలోమీటర్ రాయిపై ఉండే రంగు, మీరు ప్రయాణం చేస్తున్న రహదారి జాతీయ రహదారినా లేక గ్రామీణ రోడ్డునా అనే ముఖ్యమైన సమాచారాన్ తెలియజేస్తుంది. ఆ నాలుగు రంగుల కోడ్ ఏమిటో తెలుసుకుందాం.

Kilometer Stone: కిలోమీటర్ రాయి రంగుల్లో కోడ్ ఇదే! ఇది తెలిస్తే ఎప్పటికీ దారితప్పరు..
Kilometer Stone Colors
Bhavani
|

Updated on: Oct 01, 2025 | 4:01 PM

Share

దేశంలో ఏ రోడ్డుపై ప్రయాణించినా దూరం తెలిపే కొలత రాళ్లు కచ్చితంగా దర్శనం ఇస్తాయి. వీటిని సాధారణంగా కిలోమీటర్ రాళ్లు అంటారు. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ఎంత దూరం ఉందో ఈ రాళ్లు తెలియజేస్తాయి. అయితే, ఈ కిలోమీటర్ రాయి పైభాగంలో ఉండే రంగు, మనం ప్రయాణిస్తున్న రోడ్డు ఏ కేటగిరీకి చెందిందో సూచిస్తుంది.

ప్రభుత్వం రోడ్డు రకాల ఆధారంగా రంగులను కేటాయించింది. కిలోమీటర్ రాళ్లు అన్నీ సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి. అయితే, రాయి పైభాగంలో దాదాపు 25 శాతం వరకు వేరే రంగు వేసి రోడ్డు రకాన్ స్పష్టం చేస్తారు.

రంగుల రహస్యం ఇదే:

పసుపు – తెలుపు : కిలోమీటర్ రాయి పైభాగం పసుపు రంగులో ఉంటే, మీరు జాతీయ రహదారి పై ప్రయాణం చేస్తున్నారని అర్థం. ఇది అత్యంత ప్రధానమైన రహదారి.

ఆకుపచ్చ – తెలుపు : ఈ రంగు ఉన్నట్లైతే అది రాష్ట్ర రహదారి పై ఉన్నామని తెలుపుతుంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలన్ ఇది కలుపుతుంది.

నలుపు – తెలుపు : ఈ రంగు పెద్ద జిల్లా రోడ్డు లేదా పట్టణంలోని సిటీ రోడ్డుకు సంకేతం.

ఆరెంజ్ – తెలుపు : రాయిపై ఆరెంజ్ రంగు ఉంటే, అది గ్రామీణ రోడ్డు అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోడ్లను సాధారణంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లాంటి పథకాల కింద అభివృద్ధి చేస్తారు. ఈ రంగుల ద్వారా మీరు ఎక్కడ ఉన్నారో, మీ ప్రయాణం ఏ రకమైన రహదారిపై కొనసాగుతుందో సులభంగా తెలుసుకోవచ్చు.

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..