Telangana: హస్త కళాకారిణి అద్భుత సృష్టి.. అబ్బురపరిచే మువ్వన్నెల జెండా కండువా..

స్వాతంత్య్ర దినోత్సవం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మువ్వన్నెల జెండా. ఆ మువ్వన్నెల ఫ్లాగ్ ను చేతబట్టి దేశభక్తిని ప్రదర్శిస్తారు. ఆ మువ్వన్నెల జెండాను చూడగానే అందరికీ దేశభక్తి, జాతీయ భావంతో గర్వంగా సెల్యూట్ చేస్తారు. దేశభక్తిని పెంపొందించేందుకు స్వాతంత్య్ర దినోత్సవం కోసం చేనేత హస్త కళాకారిణి ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Telangana: హస్త కళాకారిణి అద్భుత సృష్టి.. అబ్బురపరిచే మువ్వన్నెల జెండా కండువా..
Handicraft Artist Pratima
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Aug 02, 2024 | 5:06 PM

స్వాతంత్య్ర దినోత్సవం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మువ్వన్నెల జెండా. ఆ మువ్వన్నెల ఫ్లాగ్ ను చేతబట్టి దేశభక్తిని ప్రదర్శిస్తారు. ఆ మువ్వన్నెల జెండాను చూడగానే అందరికీ దేశభక్తి, జాతీయ భావంతో గర్వంగా సెల్యూట్ చేస్తారు. దేశభక్తిని పెంపొందించేందుకు స్వాతంత్య్ర దినోత్సవం కోసం చేనేత హస్త కళాకారిణి ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

హైదరాబాద్‌కు చెందిన ప్రతిమ రాపర్తి నాంపల్లిలోని కమలానెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆర్కిటెక్చరల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. భారతీయ హస్తకళలపై ఇష్టంతో ప్రతిమ.. మగ్గం నేయడం, చిత్రలేఖనం నేర్చుకున్నారు. అంతేకాదు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలోని మిమి క్రాఫ్ట్స్‌లో బ్లాక్‌ ప్రింటింగ్‌ కూడా నేర్చుకుని హస్త కళాకారిణిగా ఆర్టిజన్‌ కార్డు పొందారు.

దేశానికి తన వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో 2018లో ‘చర్ఖా’ ఆన్‌లైన్‌ పేరుతో చేనేత, హస్తకళల ప్రోత్సాహక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా భారతీయ చేనేత, హస్తకళలకు గౌరవం సాధించాలని ప్రతిమ భావించారు. స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రత్యేకంగా మువ్వన్నెల జెండా రంగులతో మధ్యలో సంస్కృతికి చిహ్నమైన ముగ్గును చిత్రించి మెడలో ధరించే కండువాను చేనేత వస్త్రంతో తయారు చేశారు. ఈ కండువాకు 2022 సంవత్సరంలో పేటెంట్‌ లభించింది.

తెలంగాణ సంప్రదాయ బతుకమ్మను ముద్రించి చేనేత వస్త్రంతో సంచిని కూడా తయారు చేశారు. ప్రజల్లో దేశభక్తి పెంచాలని, జాతీయ భావన పెంపొందించాలని మువ్వన్నెల రంగుల అంచుతో కుటుంబ సభ్యులంతా ధరించేలా చేనేత మగ్గాలపై నేసిన వస్త్రాలను ప్రతిమ రూపొందించారు. ‘మనమంతా ఒకే తాను ముక్కలం’ అనే సందేశంతో భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో దేశమంతటా ప్రచారం చేస్తున్నట్లు ప్రతిమ తెలిపారు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణ పద్ధతికి, తన బతుకమ్మ సంచీకి పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశానని వెల్లడించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..