బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా..? రాత్రి ఈ పని చేశారంటే ఉదయానికి ఒక్కటి కూడా కనిపించదు
బొద్దింకలు ఇంట్లో ఎక్కువ అవ్వడం వల్ల క్రమంగా ఇంట్లోవాళ్లు అనేక రకాల అనారోగ్య సమస్యల బారినపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, బొద్దింకలు ఎక్కువగా ఉన్నవారు అనేక రకాల రసాయనాలతో కూడిన మందులను పిచికారి చేస్తుంటారు.. అయినప్పటికీ ఫలితం ఉండదు. తరచూ బొద్దింకలు ఇబ్బందిపెడుతూనే ఉంటాయి. అయితే, సులభంగా బొద్దింకల నుంచి విముక్తి కలిగించే కొన్ని ఇంటి నివారణలు అద్భుత ఫలితానిస్తాయి. అలాంటి టిప్స్ కొన్ని ఇక్కడ తెలుసుకుందాం..

ప్రస్తుతం చాలామంది ఇళ్లలో బొద్దింకల సంచారం ఎక్కువైపోయింది. నైట్ లైట్స్ ఆఫ్ చేశాక బొద్దింకలు ఇల్లంతా సంచారం చేస్తున్నాయి. బొద్దింకలు ఉండడం సర్వసాధారణమైనప్పటికీ ఆహార పదార్థాలపై కూడా తిరుగుతున్నాయి. దీనివల్ల అనేక జబ్బులు బారిన పడుతున్నారు. పైగా, బొద్దింకలు పిల్లలను పెట్టి వాటి సామ్రాజ్యాన్ని వ్యాప్తి చెందేలా చేస్తుంటాయి. అలా బొద్దింకలు ఇంట్లో ఎక్కువ అవ్వడం వల్ల క్రమంగా ఇంట్లోవాళ్లు అనేక రకాల అనారోగ్య సమస్యల బారినపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, బొద్దింకలు ఎక్కువగా ఉన్నవారు అనేక రకాల రసాయనాలతో కూడిన మందులను పిచికారి చేస్తుంటారు.. అయినప్పటికీ ఫలితం ఉండదు. తరచూ బొద్దింకలు ఇబ్బందిపెడుతూనే ఉంటాయి. అయితే, సులభంగా బొద్దింకల నుంచి విముక్తి కలిగించే కొన్ని ఇంటి నివారణలు అద్భుత ఫలితానిస్తాయి. అలాంటి టిప్స్ కొన్ని ఇక్కడ తెలుసుకుందాం..
బొద్దింకల నివారణ కోసం ఇంట్లో బోరాక్స్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార మూడింటిని బకెట్ నీళ్లలో కలిపి పిచికారి చేయటం వల్ల ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వారంలో ఇలా నాలుగు రోజులపాటు పిచికారి చేస్తే, బొద్దింకల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. ఈ మిశ్రమం పిచికారి చేయడం వల్ల దోమలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే బల్లుల బెడద కూడా తగ్గుతుంది.
బొద్దింకల నివారణ కోసం మరో టిప్ కూడా అద్భుత ఫలితానిస్తుంది. ఇందుకోసం బోరిక్ యాసిడ్ పౌడర్ తీసుకుని అందులో రెండు మూడు స్పూన్ల మైదా పండిని కలిపి మాత్రలు తయారు చేసుకోవాలి. బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న చోట ఈ మాత్రలు వేయాలి. ఇలా చేయడం వల్ల బొద్దింకలన్నీ పారిపోతాయి. అలాగే, వంటింటి సింక్, డ్రెయిన్ కవర్ వద్ద బొద్దింకలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటప్పుడు అక్కడ వెనిగర్ పోయాలి. ఇలా చేస్తే బొద్దింకలు రావు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








