Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (మే 25-31, 2025): మేష రాశి వారికి ఈ వారం కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రయత్న లోపం లేని పక్షంలో ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు పూర్తిగా చక్కబడతాయి. వృషభ రాశి వారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం పెరగడం, ఆరోగ్యం అనుకూలంగా మారడం, ఖర్చులు బాగా తగ్గడం వంటివి చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 25, 2025 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): తృతీయ స్థానంలో ప్రవేశించిన గురువు వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రయత్న లోపం లేని పక్షంలో ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు పూర్తిగా చక్కబడతాయి. లాభ స్థానంలో ప్రవేశించిన రాహువు వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ఉద్యోగంలో పదోన్నతి కలగడానికి, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలు బాగా బిజీగా సాగిపోతాయి. విలాస జీవితం గడుపుతారు. కుటుంబ ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల అన్నిటా విజయాలు కలుగుతాయి.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ వారం ధన స్థానంలోకి గురువు ప్రవేశించడం వల్ల, శనీశ్వరుడు లాభ స్థానంలో ఉండడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు జోరుగా సాగిపోతాయి. లాభాలు, రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. వృథా ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. తరచూ శివార్చన చేయడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశిలోకి గురువు ప్రవేశించడంతో ఆదాయం పెరగడం, ఆరోగ్యం అనుకూలంగా మారడం, ఖర్చులు బాగా తగ్గడం వంటివి చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్దాసక్తులు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలుగుతాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. బంధుమిత్రులు బాకీలు తీర్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు, దైవ కార్యాలపై ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నా, తగిన ప్రతిఫలం అందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తరచూ శివార్చన చేయించడం వల్ల సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలోకి గురువు ప్రవేశం వల్ల ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు ముగింపు పలుకుతారు. సప్తమ స్థానంలో  రాహువు ప్రవేశం వల్ల దంపతుల మధ్య అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల అనుకూలతలు పెరుగుతాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): భాగ్య స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. దశమ స్థానంలో గురువు ప్రవేశం వల్ల ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగం లోకి మారడానికి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో వృద్ది చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొన్ని శుభ వార్తలు వింటారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తరచూ దుర్గా దేవిని అర్చించడం, శివార్చన చేయించడం వల్ల వల్ల సప్తమ శని దోషం బాగా తగ్గిపోతుంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశికి గురువు భాగ్య స్థానంలో ప్రవేశించడం, శని ఆరవ స్థానంలో సంచారం చేయడం వల్ల అనేక విధాలుగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు పెరగడంతో పాటు అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి లేదా సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణను, నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయి.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో, రవి, బుధులు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో బాగా రాణించడం, సమర్థతను నిరూపించుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. గురువు అష్టమ స్థానంలోకి మారినందువల్ల ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. మిత్రుల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలను పరిష్కరించడంలో తొందరపడకపోవడం మంచిది. కుటుంబంలో కొద్దిపాటి టెన్షన్లు ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.  వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలు కలుగు తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్కంద స్తోత్రం చదువుకోవడం వల్ల కుటుంబ సమస్యలు తగ్గుతాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గురువు సప్తమ స్థానంలో, రాహువు తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోయి, అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఒకటి రెండు ఆశించిన శుభ వార్తలు వినడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలకు ఢోకా ఉండదు. అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు. మిత్రుల సహాయంతో ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. తరచూ గణపతి స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశికి ఆరవ స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తృతీయ స్థానంలోకి రాశ్యధిపతి శని ప్రవేశించడం వల్ల ఆదాయం బాగా పెరగడంతో పాటు కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.  సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సుందరకాండ పారాయణం చేయడం మంచిది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చతుర్థ స్థానంలో రవి, బుధుల కలయిక, పంచమ స్థానంలో గురు ప్రవేశం వల్ల ఈ వారమంతా జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉద్యోగాలు, చదువులకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఆశించిన ఫలితం అందుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. దుర్గాదేవి స్తోత్రం పారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో, రవి, బుధులు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోవడంతో పాటు, శుభ కార్యాలకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది.  వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. లలితా సహస్ర నామం పఠించడం చాలా మంచిది.

12 / 12
Follow us