AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone: స్మార్ట్ ఫోన్‌‌‌లో మీ వ్యక్తిగత విషయాలను సేవ్ చేస్తున్నారా? అయితే, జర భద్రం..ఈవిధంగా చేస్తే మీ డాటా సేఫ్!

Smart Phone: స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన అవసరంగా మారింది. ఇందులో మన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, సున్నితమైన బ్యాంకు సంబంధిత సమాచారం వంటి వ్యక్తిగత డేటాను నిల్వ చేసుకునే సదుపాయం ఉంది.

Smart Phone: స్మార్ట్ ఫోన్‌‌‌లో మీ వ్యక్తిగత విషయాలను సేవ్ చేస్తున్నారా? అయితే, జర భద్రం..ఈవిధంగా చేస్తే మీ డాటా సేఫ్!
Smart Phone
TV9 Telugu Digital Desk
| Edited By: KVD Varma|

Updated on: Jul 17, 2021 | 6:50 PM

Share

Smart Phone: స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన అవసరంగా మారింది. ఇందులో మన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, సున్నితమైన బ్యాంకు సంబంధిత సమాచారం వంటి వ్యక్తిగత డేటాను నిల్వ చేసుకునే సదుపాయం ఉంది. దీనిని మనం ఎక్కువగా ఉపయోగించుకున్తున్నాం. దీని కారణంగా ఇది సైబర్ హ్యాకర్ల లక్ష్యంగా ఉంది. అటువంటి పరిస్థితిలో, స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండటం అదేవిధంగా, మన వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

తెలియని లింక్‌లను తెరవవద్దు

ఎవరైనా మీకు తెలియని నంబర్ నుండి సోషల్ మీడియా ఖాతాకు లేదా మీకు తెలియని ఎస్ఎంఎస్ ద్వారా లింక్‌ను పంపిస్తే, ఆ లింక్‌ను తెరవవద్దు. లింక్ పంపిన వ్యక్తి మీకు తెలిస్తే, మొదట ఈ లింక్ దేని కోసం అని వారిని అడగండి. ఏదైనా సంతృప్తికరమైన సమాధానం ఉంటే, ఆ లింక్‌ను మాత్రమే తెరవండి. లేకపోతే దాన్ని తెరవవద్దు. ఏదైనా నమ్మదగని లింక్‌ను తెరవడం వల్ల మీ ఫోన్, ల్యాప్‌టాప్ మొదలైన వాటికి నష్టం జరుగుతుంది.

ఉచిత వస్తువులను ఇస్తామని ఆఫర్ ఇస్తున్న సైట్‌లను తెరవవద్దు. చాలా వెబ్‌సైట్లు ఆకర్షణీయమైన సందేశాలను, ఫోటోలను చూపెడతాయి. ఇందులో ఇంటర్నెట్ వినియోగదారులకు ఉచిత వస్తువుల ఎర వేస్తారు. వారు ఈ లింక్‌ను మరో పది మందికి పంపమని చెబుతూ మెసేజ్ ఇస్తారు. అలాంటి వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండాలి. అలాంటి లింక్‌ను మరెవరికీ పంపకూడదు. ఎందుకంటే ఇలాంటి చాలా వెబ్‌సైట్లు డేటాను దొంగిలించే అవకాశాలు ఉన్నాయి.

అవిశ్వసనీయ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవద్దు..

ఈ మధ్య కాలంలో యుపిఐ ద్వారా డబ్బు లావాదేవీలు చేయడం చాలా సులభం అయింది. కానీ, అదే సమయంలో, మనం తెలియని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయకుండా లేదా అలాంటి క్యూఆర్ కోడ్‌పై డబ్బు పంపకుండా జాగ్రత్త పడాలి. ఇక మీరు ఏదైనా దుకాణంలో యుపిఐని ఉపయోగిస్తుంటే, దుకాణదారుడి నుండి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత, ఫోన్‌లో వస్తున్న పేరునుద్రువీకరించుకోండి. దాని వలన డబ్బు దుకాణదారుడికి వెళుతోందని మీరు తెలుసుకోవచ్చు.

డేటాను నిల్వ చేసే విధానాన్ని మార్చండి

ఇంటర్నెట్‌లో డేటాను నిల్వ చేయడానికి తరచుగా గూగుల్ డ్రైవ్ లేదా ఇతర క్లౌడ్‌ను ఉపయోగిస్తుంటారు. కాని భద్రత కోణం నుండి ఇటువంటి బ్యాకప్‌లను తయారు చేయకుండా ఉండాలి. ముఖ్యంగా సోషల్ సైట్ చాట్ లేదా గ్యాలరీ బ్యాకప్, ఎందుకంటే డేటాను అక్కడి నుండి హ్యాక్ చేయవచ్చు. డ్రైవ్‌కు బదులుగా, మన డేటాను పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లో నిల్వ చేయాలి.

Also Read: Space: అంతరిక్షంలో అస్ట్రోనాట్స్‌ ఎలా జీవిస్తారో మీకు తెలుసా? వారేం తింటారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..

Oldest Whiskey: ప్రపంచంలోనే అతి పురాతనమైన విస్కీ బాటిల్ ధర ఎంత ఉండొచ్చు.. అంచనా వేయగలరా? కచ్చితంగా అసలు ధర చెప్పలేరు..