అసలు భూమిపై బంగారం ఎలా తయారవుతుంది.. పసిడి పుట్టుక రహస్యం గురించి మీకు తెలుసా?
Mystery of gold formation: మన భారత దేశంలో బంగారు ఆభరణాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. కానీ ప్రస్తుతం బంగారం జనాలకు ఒక అందని ద్రాక్షగా మారిపోయింది. సమాన్యులు ఇప్పుడు బంగారం కొనే పరిస్థితి లేదు. అయితే బంగారం భూమిలోంచి వస్తుందని అందరికి తెలుసు.. కానీ అలసు బంగారం ఎలా తయారవుతుంది.. పసిడి పుట్టక చరిత్ర గురించి మీకు తెలుసా. అయితే తెలుసుకుందాం పదండి.

బంగారం.. ఇది ప్రస్తుతం మానవాళికి అత్యంత విలువైన లోహాలలో ఒకటి. ఎంతో పురాతమైన ఈ లోహానికి వేల సంవత్సరాలుగా చరిత్ర ఉంది. అనాటి నుంచి బంగారం సంపద, స్వచ్ఛత, శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ప్రాధాన్యతలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అసలు బంగారం ఎలా తయారవుతుంది అనే విషయానికి వస్తే.. నిజానికి, బంగారం మొదట గనుల్లో దొరికేది కాదు..ప్రాచీన మానవుల కాలంలో నదీ తీరాలలో, రాళ్ల దగ్గర ఈ బంగారం స్వచ్ఛమైన రూపంలో దొరికేది.. ఇక్కడే మొదటి సారిగా ఈ విలువైన లోహాన్ని కనుగొన్నారు. నేలపై మెరుస్తూ కనిపించిన ఈ పసుపు లోహం.. ఆకర్షణీయంగా కనిపించడంతో.. దీన్ని సేకరించడం స్టార్ట్ చేశారు.
చారిత్రక రికార్డుల ప్రకారం, బంగారం మొదట 4000 BC ప్రాంతంలో మెసొపొటేమియాలో కనుగొనబడింది. తరువాత, 3100 BC ప్రాంతంలో ఈజిప్టులోని నుబియన్ ప్రాంతంలో బంగారం సహజంగా ప్రజల కంట పడింది. ఆ కాలంలోని ప్రజలు బంగారం అందం, రంగు, మెరుపుకు ఆకర్షితులయ్యారు. ఇది బంగారాన్ని ప్రారంభ సంస్కృతులలో ఒక ముఖ్యమైన భాగంగా చేసింది. దీంతో ఈజిప్ట్, గ్రీస్, రోమ్, సింధు లోయ, ప్రాచీన చైనా వంటి నాగరికతలు కళ, మతం, వాణిజ్యంలో బంగారాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. కాలక్రమేనా ఈజిప్షియన్లు బంగారాన్ని ఆభరణాలుగా తయారు చేసి తమ రాజుల సమాధులను అలంకరించారు. తర్వాత మెసొపొటేమియా ప్రజలు బంగారు ఆభరణాలు, నాణేలను తయారు చేశారు.
దీంతో సింధు లోయ నాగరికత ప్రజలు బంగారు పూసలు, ఆభరణాలతో వ్యాపారం ప్రారంభించారు. గ్రీకులు, రోమన్లు దేవాలయాలు, కవచం, కరెన్సీ కోసం బంగారాన్ని ఉపయోగించారు. దీంతో కాలక్రమేనా బంగారం విలువ, దాని ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం బంగారం దొరకడం చాలా అరుదుగా మారిపోయింది. అలాగే చాలా వాటిలో బంగారం ఉపయోగం కూడా పెరిగింది. దీంతో ఈ పసుపు లోహానికి డిమాండ్ కూడా పెరిగింది. దీంతో ప్రస్తుతం ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




