Viral Video: ఎర కోసం కొట్టుకున్న హైనాలు, చిరుత.. మాములుగా లేదుగా.. షాకింగ్ వీడియో మీకోసమే!
సింహాన్ని అడవి రాజు అని పిలుస్తారు కానీ చిరుత కూడా తక్కువేం కాదు. వేగంలోనూ, వేటాడంలోనూ సింహానికి సమవుజ్జీగా నిలుస్తుంది...
సింహాన్ని అడవి రాజు అని పిలుస్తారు కానీ చిరుత కూడా తక్కువేం కాదు. వేగంలోనూ, వేటాడంలోనూ సింహానికి సమవుజ్జీగా నిలుస్తుంది. ఏ జంతువైనా చిరుత కళ్లకు చిక్కిందంటే.. దాని కథ ముగిసినట్లే. అందుకే చిరుతను ‘ది హంటర్’ అని కూడా పిలుస్తుంటారు. అయితే కొన్నిసార్లు చిరుత తన ఎరను పట్టుకోవడంలో విఫలం అవుతుంది కూడా. అలాంటి ఓ వీడియో ఇప్పుడు చూద్దాం.
అడవిలో చట్టాలు పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉంటాయి. అక్కడ బలం లేకపోతే జీవించడం కష్టం. సింహం, పులి, చిరుత లాంటి క్రూర జంతువులు.. తమ పొట్టను నింపుకునేందుకు మిగతా జంతువులను వేటాడక తప్పదు. అయితే ఓ ఎరను తనది చేసుకునేందుకు వేటాడే జంతువులు ఒకదానితో మరొకటి అప్పుడప్పుడూ దాడి చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.
— Wild Captured (@WildCaptured) July 10, 2021
ఇందులో ఓ చిరుత.. జింకను వేటాడి.. దాని కళేబరంతో చెట్టుపైకి ఎక్కుతుంది. ఎక్కడ నుంచి చూశాయో గానీ.. రెండు హైనాలు.. ఆ ఎరను లాక్కునేందుకు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగా అక్కడికి చేరుకుంటాయి. వాటిని గమనించిన చిరుత.. తన ఎరతో పైకొమ్మ మీదకు ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అది దాని వల్ల కాలేదు. దీనితో హైనాలు ఆ ఎరగా మారిన జింక కాలును పట్టుకుని లాగడం మొదలుపెట్టాయి.
కొద్దిసేపు అలాగే దాన్ని పట్టుకుని వేలాడిన హైనాలు చివరికి విజయం సాధించాయి. ఆ ఎర చిరుత నోటి నుంచి జారిపడుతుంది. ఈ వీడియోను ‘వైల్డ్ క్యాప్చర్డ్’ అనే ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసింది. ఇప్పటిదాకా 41 వేలకుపైగా వ్యూస్ సంపాదించింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!
Also Read:
గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!
తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!
చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!