AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Bite: ఆ రాష్ట్రంలో కుక్క కరిస్తే 10 వేలు, గాయమైతే 20వేలు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు..

193 పిటిషన్లను పరిష్కరిస్తూ ఎస్ భరద్వాజ్ ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. కుక్క కరచినప్పుడు పంటి గుర్తులు ఏర్పడితే, బాధితుడికి పంటి గుర్తుకు రూ.10,000 పరిహారం ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు కుక్క కరచినప్పుడు తీవ్రంగా గాయమైనా.. లేదా మాంసం తొలగిపోయినట్లయితే.. ప్రతి 0.2 సెంటీమీటర్ల గాయానికి కనీసం రూ.20,000 పరిహారం ఇవ్వాలని పేర్కొంది. 

Dog Bite: ఆ రాష్ట్రంలో కుక్క కరిస్తే 10 వేలు, గాయమైతే 20వేలు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు..
Surya Kala
|

Updated on: Nov 16, 2023 | 1:27 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా కుక్కల బాధితుల సంఖ్య పెరుగుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుక్క కాటుకి గురవుతున్న్నారు. తాజాగా కుక్కకాటు ఘటనల పెరుగుదలపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీధుల్లో వీధికుక్కల బెడద బాగా పెరిగిపోయిందని కోర్టు పేర్కొంది. అయితే ఈ వీధి కుక్కలు ఎవరైనా కరిచినట్లయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు  నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బాధిత వ్యక్తుల కుక్క కాటు.. పంటి గుర్తుకు రూ.10,000 చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది.

గాయం తీవ్రత బట్టి పరిహారం

ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో  రోజు రోజుకీ పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై జస్టిస్ వినోద్ ఎస్ భరద్వాజ్ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 193 పిటిషన్లను పరిష్కరిస్తూ ఎస్ భరద్వాజ్ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. కుక్క కరచినప్పుడు పంటి గుర్తులు ఏర్పడితే, బాధితుడికి పంటి గుర్తుకు రూ.10,000 పరిహారం ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు కుక్క కరచినప్పుడు తీవ్రంగా గాయమైనా.. లేదా మాంసం తొలగిపోయినట్లయితే.. ప్రతి 0.2 సెంటీమీటర్ల గాయానికి కనీసం రూ.20,000 పరిహారం ఇవ్వాలని పేర్కొంది.

మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు

నష్టపరిహాDog రం చెల్లించాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలదేనని హైకోర్టు పేర్కొంది. అయితే వీధి కుక్కలు కాకుండా.. పెంపుడు కుక్క కరచినట్లు అయితే.. ఆ కుక్కతో సంబంధం ఉన్న వ్యక్తి లేదా ఏజెన్సీ నుండి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం మొత్తాన్ని తిరిగి పొందవచ్చని జస్టిస్ వినోద్ ఎస్ భరద్వాజ్ ధర్మాసనం పేర్కొంది. కుక్కలు దాడి చేసిన ఘటనలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని కోర్టు పేర్కొంది. ఇప్పటికే కుక్క కురవడంతో చాలా మంది చనిపోయారు. ఈ ఘటనలను నియంత్రించకపోతే మరణించిన కేసుల సంఖ్య మరింత పెరుగుతాయని కనుక ఇక నుంచి కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పేర్కొంది.  ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని కూడా కోర్టు ప్రభుత్వాలను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్