AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidura Niti: ఈ మూడు అలవాట్లు ఉన్నవారు జీవితాంతం డబ్బు కోసం ఇబ్బంది పడుతారు.. మీలో ఇలాంటివి ఉంటే వదిలిపెట్టండి..

నేటి కాలంలోనివారికి ఉపయోగపడే ఎన్నో విషయాలను విదురుడు మహాభారత కాలంలోనే వివరించాడు. ఎలా జీవితాన్ని కొనసాగించాలి.. ఎలా జీవించడం వల్ల విజయం మన సొంతం అవుతుంది. ఇలాంటి ఎన్నోంటినో విదురుడు ప్రస్తావించాడు. అయితే ఒక వ్యక్తి ఈ 3 అలవాట్ల వల్ల జీవితంలో డబ్బు సంపాదించలేడని తేల్చి చెప్పాడు. అలాంటివారి గురించి మనం తెలుసుకుందాం..

Vidura Niti: ఈ మూడు అలవాట్లు ఉన్నవారు జీవితాంతం డబ్బు కోసం ఇబ్బంది పడుతారు.. మీలో ఇలాంటివి ఉంటే వదిలిపెట్టండి..
Vidura Niti
Sanjay Kasula
|

Updated on: Oct 17, 2022 | 6:37 PM

Share

మహాత్మా విదురుడు మహాభారత కాలంలో అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకరు. శ్రీకృష్ణుడు, మహాత్మా విదురుడిని అర్థం చేసుకోవడం వల్ల పాండవులు మహాభారత యుద్ధంలో విజయం సాధించారు. మహాత్మా విదురుడిలో వివేకం, తెలివితేటలు ఉన్నప్పటికీ ఆయనలో కొద్దిగా కూడా గర్వం కనిపించదు. విదుర నీతి అనేది మహాత్మా విదురుడు, మహారాజా ధృతరాష్ట్ర మధ్య జరిగిన చర్చలు, సంభాషణల సంకలనం. విదుర నీతి జీవితంలోని అన్ని కోణాలను చర్చిస్తుంది. మనుషుల్లో ఉండే చెడు అలవాట్ల గురించి చెప్పాడు. దాని కారణంగా అతను తన జీవితమంతా సంపద, ఆనందం, శ్రేయస్సు కోసం తహతహలాడుతున్నాడు.

సోమరితనం..

సోమరిపోతులపై మా లక్ష్మి కోపంగా ఉంటుందని విదురుడు చెప్పారు. వారికి తల్లి ఆశీస్సులు ఎప్పుడూ లభించవు. దీని కారణంగా అలాంటి వ్యక్తులు వారి జీవితాంతం ఆర్థిక పరిమితులను కలిగి ఉంటారు. అలాంటి వారు ఎప్పుడూ అదృష్టం కోసం ఏడుస్తూ.. ఎదరు చూస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. విదురుడు చెప్పినట్లుగా.. ఇలాంటికి వారి నాశనానికి కారణం వారి స్వంత సోమరితనమే అని అన్నారు. సోమరితనం పేదరికాన్ని పుట్టిస్తుంది. ఇది జీవితానికి అతిపెద్ద శత్రువుగా పరిగణించబడుతుంది. సోమరులు తమ జీవితాంతం డబ్బు, డబ్బు లేకపోవడం భరించవలసి ఉంటుంది.

కష్టపడి దొంగతనం చేసేవారు..

కష్టపడడమే విజయానికి నిచ్చెన అని విదురుడు చెప్పారు. ప్రతి మనిషి తన కష్టార్జితం వల్లే విజయాల ఎత్తులను అందుకుంటారని స్పష్టం చేశారు. విదుర నీతిలో చెప్పినట్లుగా.. సమాజంలో డబ్బు, పదవి, పలుకుబడి, పురోభివృద్ధి, విజయాలు, ఉద్యోగాలు పొందాలని కోరుకునే కొందరు వ్యక్తులు ఉంటారని.. అయితే ఇలాంటివి కష్టపడకుండా ఎప్పటికీ నెరవేరవని విదురుడు చెప్పారు.

దేవుడిని నమ్మని వారు..

దేవుడిని నమ్మని వ్యక్తిపై భగవంతుని కృప ఎప్పుడూ ఉండదని, అతని జీవితాంతం పేదరికం ఉంటాడని అంటాడు విదురుడు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం