Crime Video: శివయ్య పిలుస్తున్నాడంటూ యువకుడు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో షాకింగ్‌ విషయాలు..

Crime Video: శివయ్య పిలుస్తున్నాడంటూ యువకుడు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో షాకింగ్‌ విషయాలు..

Anil kumar poka

|

Updated on: Oct 18, 2022 | 9:57 AM

ఆత్మహత్య చేసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆర్థిక కష్టాలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ, చదువు, ఉద్యోగం ఇలా రకరకాల


ఆత్మహత్య చేసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆర్థిక కష్టాలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ, చదువు, ఉద్యోగం ఇలా రకరకాల కారణాలతో నిత్యం ఎంతో మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అయితే, ఇక్కడ ఓ యువకుడు తనను ఈ పాడు సమాజంలో ఉండొద్దని, తనవద్దకు వచ్చేయమని శివుడు తనను పిలుస్తున్నాడని చెప్పి ఆత్మార్పణం చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చాట్లమడ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చాట్లమడ గ్రామానికి చెందిన వెంకట పూర్ణ శేఖర్ రెడ్డికి శివుడు అంటే ప్రాణం. ఎక్కడలేని భక్తిభావం. ఇప్పటికే తండ్రి చనిపోయాడు. తల్లిని, చెల్లిని అన్నీ తానై చూసుకుంటున్నాడు. చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు గానీ, చెన్నై నుంచి తన స్వగ్రామానికి వచ్చాడు. శివయ్య పిలుస్తున్నాడంటూ ఓ సూసైడ్‌ నోట్ రాసి ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, ప్రేమ వంటి వ్యవహారాలు లేవని స్పష్టం చేశాడు. తాను పిరికివాడిని కాదని, ఈ పాడు సమాజంలో ఉండవద్దంటూ శివుడు చెప్పాడని, అందుకే చనిపోతున్నానని సూసైడ్‌ నోట్‌లో రాశాడు. తన తండ్రి కూడా శివయ్య దగ్గరే సేవ చేస్తున్నందున అక్కడికే వెళ్ళిపోతున్నానని సూసైడ్‌ నోట్‌లో తెలిపాడు. వచ్చే జన్మలో సమాజానికి మేలు చేసేందుకు అవకాశం కల్పించాలని శివయ్యను వేడుకుంటానని నోట్‌లో రాశాడు. చనిపోతూ తన చెల్లెలు సాయిలక్ష్మిని బంధువులంతా బాగా చూసుకోవాలని కోరాడు. ఆస్తులన్నీ తన చెల్లెలి పేరుతో రాయాలని, మంచి వరుణ్ణి చూసి పెళ్ళి చేయాలని సూచించాడు. ఇన్ని జాగ్రత్తలు చెబుతున్న తనకు ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని, కేవలం శివయ్య పిలుస్తున్నందునే సూసైడ్‌ చేసుకుంటున్నట్టు రాశాడు. ఈ ఘటనతో చాట్లమడ గ్రామంలోని శేఖర్‌రెడ్డి కుటుంబం తల్లడిల్లిపోయింది. శేఖర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం శివయ్య పిలుపే అని రాసిన సూసైడ్‌ నోట్‌ చూసి అయోమయంలో పడిపోయారు. కాగా, శేఖర్ రెడ్డి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 18, 2022 09:06 AM