AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓరి దేవుడా.. విధి ఆడిన వింత నాటకం.. పెళ్లైన 5 రోజులకే..!

వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో కుప్పకూలిపోయిన స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నింపింది.

Telangana: ఓరి దేవుడా.. విధి ఆడిన వింత నాటకం.. పెళ్లైన 5 రోజులకే..!
Manchiryal Tragedy
Naresh Gollana
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 08, 2024 | 1:10 PM

Share

అయ్యో ఎంత దారుణం జరిగిపోయింది. కాళ్ల పారాణి ఇంకా ఆరక ముందే అప్పుడే ఓ నవ వదువుకు నూరేళ్లు నిండిపోయాయి. ప్రేమించి తల్లిదండ్రులను‌ ఎదురించి, ప్రియుడిని మనువాడి.. కొత్త ఆశలు, ఎన్నో కొత్త ఊసులతో అత్తారింట్లో అడుగు పెట్టగానే ఆ యువతిని కరెంట్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది నవవదువు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంచి.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రానికి చెందిన సిద్దు, జంబీ స్వప్న గత‌కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు ప్రేమ వివాహానికి యువతి స్వప్న తరుఫున కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు నిరాకరించడంతో 5 రోజుల క్రితం బెల్లంపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడు ముళ్లు ఏడడుగులతో స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అత్తగారింటిలో అడుగు పెట్టిన స్వప్నకు సిద్దు తల్లిదండ్రులు ఘన స్వాగతమే పలికారు. కానీ అంతలోనే ఆ ఆనందం ఆవిరైంది.

ఉదయం కాలకృత్యాలకు నీళ్లు వేడి చేసేందుకు వాటర్ హీటర్ పెడుతున్న సమయంలో ఒక్కసారిగా స్వప్న విద్యుత్ షాక్ కు గురైంది. వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో కుప్పకూలిపోయిన స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నిండింది. ఈ సమాచారం తెలుసుకున్న స్వప్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా ఉంటుందని అనుకునేలోగా, ఇంత ఘోరం జరిగిపోయిందే అని తోటి స్నేహితులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు‌ చేసి విచారణ చేపట్టారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..