Moroccan Sultan: 4 భార్యలు, 500 మంది ప్రియురాళ్లు, 1,171 మంది పిల్లలు.. ఈయనగారి చరిత్ర మామూగా లేదుగా..
ఆఫ్రికా దేశం మొరాకో.. భూకంపం సృష్టించిన బీభత్సంతో అల్లాడిపోతోంది. ఇప్పటికే 2 వేల మందికి పైగా మరణించారు. ఎక్కడ చూసినా శవాలు, క్షతగాత్రులు, శోకసంద్రం నెలకొంది. మొరాకో.. సాంప్రదాయ హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఆ దేశ చరిత్రను పరిశీలిస్తే.. మొరాకోకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక పాలకుడు ఉన్నాడు. అత్యధిక పిల్లలకు తండ్రిగా రికార్డు ఆయన పేరిట నమోదైంది. అతనే మౌలే ఇస్మాయిల్. మొరాకో చరిత్రలోనే అత్యంత క్రూరమైన పాలకుడు.

ఆఫ్రికా దేశం మొరాకో.. భూకంపం సృష్టించిన బీభత్సంతో అల్లాడిపోతోంది. ఇప్పటికే 2 వేల మందికి పైగా మరణించారు. ఎక్కడ చూసినా శవాలు, క్షతగాత్రులు, శోకసంద్రం నెలకొంది. మొరాకో.. సాంప్రదాయ హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఆ దేశ చరిత్రను పరిశీలిస్తే.. మొరాకోకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక పాలకుడు ఉన్నాడు. అత్యధిక పిల్లలకు తండ్రిగా రికార్డు ఆయన పేరిట నమోదైంది. అతనే మౌలే ఇస్మాయిల్. మొరాకో చరిత్రలోనే అత్యంత క్రూరమైన పాలకుడు. అతను మొరాకోను దాదాపు 55 సంవత్సరాలు పాలించాడు.
మొరాకో చరిత్రలో ఎక్కువ కాలం పాలించిన రాజుగా మోయల్ ఇస్మాయిల్ నిలిచాడు. అతని క్రూరత్వం, ఇతర లక్షణాలు చరిత్రలో రికార్డ్ అయ్యాయి. అంతేకాదు.. అతనికి విపరీతమైన షార్ట్ టెంపర్ ఉండేదట. ఆ విధంగానూ అతను హాట్ టాపిక్‌గా నిలిచాడు.
హాట్ టెంపర్డ్ చర్చలు..
మోయల్ ఇస్మాయిల్ 1645లో మొరాకోలోని పురాతన నగరం సిజిల్మాసాలో జన్మించాడు. సామ్రాజ్యం బలహీనపడిన సమయంలో మోయల్ మొరాకోలో అధికారంలోకి వచ్చాడు. అతని పాలనలో గిరిజనులు అంతర్గత యుద్ధం సాగిస్తున్నారు. రాజ్యంలో పరిస్థితి విషమించింది. కానీ రాజు తన తెలివి, వ్యూహంతో ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొన్నాడు. సైనికుల నియామకం ప్రారంభించాడు. దాంతో గిరిజనులపై ఆధారపడటం తగ్గిపోయింది. రాజు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే బానిసలను ఎడారి ప్రాంతాల నుండి రిక్రూట్ చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా రాజు 1.5 లక్షల మందికి పైగా సైనికులతో సైన్యాన్ని పెంచి శక్తివంతమైన రాజుగా ఎదిగాడు.
మోయల్ క్రూరత్వం ఎలా ఉండేదంటే.. అతన్ని రక్త పిపాసి సుల్తాన్ అని కూడా పిలుస్తారు. మొరాకోలోని ఫైజ్ నగరంలో రాజు 400 మంది తిరుగుబాటుదారులను నరికి చంపాడు. తిరుగుబాటుదారుల అంతంతో చక్రవర్తి తన పాలనను ప్రారంభించాడు. అంతే కాదు.. ఈ సందేశాన్ని ఇతర దేశాలకు విస్తృతంగా వ్యాప్తి చేయడానికి.. తలలను గోడపై సీలలకు వేలాడదీశాడు. గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలతో దౌత్య సంబంధాలు మొరాకోలో బలపడటానికి మోయల్ ఈ వ్యూహాన్ని అనుసరించాడు. దీంతో పాటు మరో విషయం కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది మోయల్ ప్రేమ ఆసక్తి. మహిళలపై అతనికున్న ఇంట్రస్ట్.
4 భార్యలు, 1171 మంది పిల్లలు, 500 మందికి పైగా ప్రియురాళ్లు..
మోయల్ ప్రేమ కథ ఒక సంచలనం అనే చెప్పాలి. అతనికి నలుగురు భార్యలు ఉన్నారని చెబుతారు. 500 కంటే ఎక్కువ మంది ప్రేయురాళ్లు ఉండేవారట. ఈ విషయంలో మౌలే చాలా క్రూరంగా ప్రవర్తించేవాడట. అతను ఏదైనా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. ఆ రాజ్యంలో ఉన్న అందమైన స్త్రీలను, రాజ్య పాలకుల కుమార్తెలను ఎత్తుకెళ్లేవాడట. ఒక యుద్ధంలో ఓడిపోయిన రాజులు సైతం తమ కుమార్తెలను మోయల్‌కు అప్పగించేవారట. ఆ విధంగా మోయల్ తన అంతఃపురంలో స్త్రీల సంఖ్యను వేగంగా పెంచుకున్నాడు.
మొరాకోకు వెళ్లిన ఫ్రెంచ్ రాయబారి డొమినిక్ బస్నోట్ తన నివేదికలో 1704 సంవత్సరం నాటికి ఆ రాజుకు 1,171 మంది పిల్లలు ఉన్నారని రాశారు. ఆ సమయంలో రాజు వయస్సు 57 సంవత్సరాలు. 32 సంవత్సరాలుగా మొరాకోను పరిపాలిస్తున్నాడు. అత్యధిక పిల్లలకు తండ్రిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మోయల్ పేరు నమోదైంది. మోయల్‌కి 888 మంది పిల్లలు ఉన్నట్లు ఆధారాలు లభించాయని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్కొంది.
వారిని చూస్తే ప్రాణాలు పోవాల్సిందే..
మోయల్ తన భార్యలు, ప్రియురాళ్ల పట్ల చాలా కఠినంగా ఉండేవాట. వీరు ఎవరినైనా చూసినా.. వీరిని ఎవరైనా చూసినా.. ప్రాణాలు గాల్లో కలవాల్సిందేనట. రాజు నేరుగా వారి తల నరికివేస్తాడట. రాణులు, ప్రియురాళ్ల ముందు.. మగాళ్లు తల ఎత్తకూడదనే నిబంధన విధించాడు మోయల్. ఇదన్నమానట రాజుగారి కళాపోషణ. మొత్తానికి ఇలా అమ్మాయలపై ప్రేమతో రాజు గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




