Cyber Alert: హ్యాకర్లతో జాగ్రత్త.. నకిలీ, నిజమైన వెబ్‌సైట్‌లను ఇలా గుర్తించండి..
నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ క్రైమ్‌కు సంబంధించిన కేసులు రోజురోజుకూ భారీగా వెలుగులోకి వస్తున్నాయి. చాలా సార్లు, షాపింగ్, చలాన్ చెల్లించడం లేదా ఏదైనా ఆన్‌లైన్ ఫార్మాలిటీని పూర్తి చేయడం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లకు సంబంధించిన లింక్స్ మన మొబైల్‌కు వస్తుంటాయి. అలాంటి లింక్‌లను కొందరు ఏమాత్రం ఆలోచించకుండా, పరిశోధించకుండా నమ్మి.. మీ వివరాలన్నింటినీ షేర్ చేస్తారు. దాంతో డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి పోతుంది.
నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ క్రైమ్‌కు సంబంధించిన కేసులు రోజురోజుకూ భారీగా వెలుగులోకి వస్తున్నాయి. చాలా సార్లు, షాపింగ్, చలాన్ చెల్లించడం లేదా ఏదైనా ఆన్‌లైన్ ఫార్మాలిటీని పూర్తి చేయడం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లకు సంబంధించిన లింక్స్ మన మొబైల్‌కు వస్తుంటాయి. అలాంటి లింక్‌లను కొందరు ఏమాత్రం ఆలోచించకుండా, పరిశోధించకుండా నమ్మి.. మీ వివరాలన్నింటినీ షేర్ చేస్తారు. దాంతో డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి పోతుంది. ఆ డేటా ఆధారంగా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులను మొత్తం లాగేస్తుంటారు. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా, మీరు బాధితులుగా మారకుండా ఉండేందుకు సైబర్ నిపుణులు అందించే కొన్ని చిట్కాలను మీకోసం అందిస్తున్నారు. వీటి ద్వారా ఏది ఒరిజినల్ వెబ్ సైట్, ఏదీ ఫేక్ అనే విషయాన్ని సులభంగా గుర్తించడానికి ఆస్కారం లభిస్తుంది. తద్వారా మీరు సేఫ్‌గా ఉంటారు.
మీరు తప్పక చేయాల్సింది ఇదే..
మీరు ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసినప్పుడు ముందుగా ఆ వెబ్ సైట్‌కు సంబంధించిన URLని జాగ్రత్తగా చదవండి. వెబ్‌సైట్ URL httpsతో ప్రారంభమవ్వాలి. ఇక్కడ s అంటే సురక్షితమని అర్థం. అయితే, మీరు దానిపై మాత్రమే ఆధారపడొద్దు. URL స్పెల్లింగ్‌ని కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు amazon amaz0n అని ఉంటుంది. ఈ స్పెల్లింగ్ ద్వారా కూడా సైబర్ నేరగాళ్లు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అలాగే .com, .net, .org వంటి డొమైన్‌ను కూడా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది.
వెబ్‌సైట్ భాషను చెక్ చేయాలి..
వెబ్‌సైట్‌లో మీకు చాలా వరకు వ్యాకరణ, స్పెల్లింగ్ తప్పులను చూసినట్లయితే.. వెంటనే అలర్ట్ అవ్వాలి. సాధారణంగా, నకిలీ వెబ్‌సైట్‌లలో ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. అందుకే అలాంటి సైట్లు మీ కంట పడితే వెంటనే అలర్ట్ అయి.. ఆ సైట్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.
కాంటాక్ట్ అస్..
ప్రతి వెబ్ సైట్‌కు కాంటాక్ట్ అస్ వంటి వివరాలు ఉంటాయి. వాటిని ముందుగా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సదరు వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ అస్ లో ఫోన్ నెంబర్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ వంటి వివరాలను తప్పకుండా చెక్ చేయాలి.
వెబ్‌సైట్ సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేయాలి..
చాలా వరకు నకిలీ వెబ్‌సైట్‌లు సోషల్ మీడియా ప్రొఫైల్‌ను క్రియేట్ చేస్తుంటాయి. వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను తనిఖీ చేయాలి. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? కంటెంటె ఎలాం ఉంది. పోస్టులపై కామెంట్స్ ఏంటి? ఏ రకమైన ప్రకనటలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? వెబ్‌సైట్‌కు, ప్రకనటలకు తేడా ఉంటే.. వెంటనే అలర్ట్ అవ్వాలి. లేదంటే స్కామ్‌కు గురయ్యే అవకాశం ఉంది. మొత్తంమీద, ఈ కీలక విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. వెబ్‌సైట్ నకిలీదా కాదా అని కనుగొనవచ్చు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండండి.. మీ వ్యక్తిగత సమాచారం, డబ్బును కాపాడుకోండి.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..