AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire-Boltt Crusader: బలమైన, ధృడమైన వాచ్ ఇది.. స్మార్ట్ ఫీచర్లు.. హెల్త్ ట్రాకర్లు.. తక్కువ ధరలోనే సమస్తం..

చవకైన ధరలో ఉత్తమ స్మార్ట్ వాచ్ లను అందించే ఫైర్ బోల్ట్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ మన దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఫైర్ బోల్ట్ క్రూసేడర్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ పేరిట దీనిని తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ లో వృత్తాకార డయల్ ఉంటుంది. చూడటానికి చాలా ధృడమైన డిజైన్ ను కలిగి ఉంది. రెండు పుష్ బటన్స్ వాచ్ పై ఉన్నాయి. పెద్ద స్క్రీన్ తో పాటు అధిక రిజల్యూషన్ కలిగిన డిస్ ప్లే ఉంది. ఇంకా దీనిలో బోలెడన్ని ఫిట్ నెస్ ట్రాక్ర్లు, హెల్త్ ఫీచర్లు ఉన్నాయి.

Fire-Boltt Crusader: బలమైన, ధృడమైన వాచ్ ఇది.. స్మార్ట్ ఫీచర్లు.. హెల్త్ ట్రాకర్లు.. తక్కువ ధరలోనే సమస్తం..
Fire Boltt Crusader Smartwatch
Madhu
|

Updated on: Sep 12, 2023 | 8:00 AM

Share

చవకైన ధరలో ఉత్తమ స్మార్ట్ వాచ్ లను అందించే ఫైర్ బోల్ట్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ మన దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఫైర్ బోల్ట్ క్రూసేడర్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ పేరిట దీనిని తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ లో వృత్తాకార డయల్ ఉంటుంది. చూడటానికి చాలా ధృడమైన డిజైన్ ను కలిగి ఉంది. రెండు పుష్ బటన్స్ వాచ్ పై ఉన్నాయి. పెద్ద స్క్రీన్ తో పాటు అధిక రిజల్యూషన్ కలిగిన డిస్ ప్లే ఉంది. ఇంకా దీనిలో బోలెడన్ని ఫిట్ నెస్ ట్రాక్ర్లు, హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫైర్ బోల్ట్ క్రూసేడర్ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, దాని ధర, లభ్యత గురించిన వివరాలను కూలంకషంగా తెలుసుకుందాం..

ఫైర్ బోల్ట్ క్రూసేడర్ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్లు ఇవే..

ఫైర్ బోల్ట్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ లో అతి పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఏకంగా 1.43 అంగుళాల సైజ్ లో అమోల్డ్ డిస్ ప్లే, 466×466 పిక్సల్స్ రిజల్యూషన్ తో ఉంటుంది. దీనిలో బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ , స్పీకర్ ఉంటుంది. బ్లూ టూత్ కాలింగ్ కు సపోర్టు చేస్తుంది. వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. మల్టిపుల్ వాచ్ ఫేసెస్ ను కలిగి ఉంది. ఈ వాచ్ లోనే కాల్ హిస్టరీ, క్విక్ డయల్ ప్యాడ్ ఉంటుంది. ఫోన్ లోని కాంటాక్ట్స్ ను సింక్రనైజ్ చేసుకోవచ్చు. రెండు పుష్ బటన్స్ ఉంటాయి.

ఫైర్ బోల్ట్ క్రూసేడర్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఇవే..

ఫైర్ బోల్ట్ క్రూసేడర్ స్మార్ట్ వాచ్ లో పలు రకాల హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. స్లీప్ మోనిటర్, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు తెలిపే వ్యవస్థ ఉంటుంది. హార్ట్ రేట్ ట్రాకింగ్, మహిళ రుతుక్రమ సరళిని ట్రాక్ చేస్తుంది. నీరు తాగడం, ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారికి సెడెంటరీ రిమైండర్స్ వంటి ఆధునిక ఫీచర్లతో పాటు స్మార్ట్ రిమైండర్స్, వెదర్ అప్ డేట్, ఇన్ బిల్ట్ గేమ్స్ కూడా ఉంటాయి. వాచ్ తోనే ఫోన్లోని మ్యూజిక్, కెమెరాలను కంట్రోల్ చేయొచ్చు. అలారం, టైమర్, స్టాప్ వాచ్ వంటి సదుపాయాలు ఉంటాయి. దీనిలో బ్యాటరీ 400ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ68 రేటింగ్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫైర్ బోల్ట్ క్రూసేడర్ స్మార్ట్ వాచ్ ధర, లభ్యత..

ఫైర్ బోల్ట్ క్రూసేడర్ స్మార్ట్ వాచ్ బ్లాక్, ఆరంజ్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీనిని మీరు ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్ సైట్లో ప్రారంభ ధర రూ. 2,499కి కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం అత్యాధునిక ఫీచర్లతో పాటు మంచి రెజిడ్ లుక్ లోఉన్న ఈ స్మార్ట్ ను ఇప్పుడే కొనుగోలు చేసేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..