TTE Seat in Train: రైలులో టీటీఈకి సీటు కూడా ఉంటుంది తెలుసా.. అతను ఏ కోచ్‌లో ఉంటాడో తెలుసుకోండి..
ట్రైన్‌లో సీటు దొరకలేదా..? ట్రైన్ ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా సమస్య ఉందా..? వెంటనే టీటీఈ కోసం వెతకడం మొదలు పెడుతున్నారా..? అయితే మీరు ప్రయాణిస్తున్న ట్రైన్‌లో టీటీఈ ఎక్కడ కూర్చుని ఉంటాడో మనలో చాలా మందికి తెలియదు. అతని ఓ ఫిక్స్డ్ సీట్ ఉంటుంది తెలుసా..

మీరు కూడా సాధారణంగా రైలులో ప్రయాణిస్తుంటే.. ఈ వార్త మీకోసమే. ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు నిత్యం టీటీఈ కోసం వెతుకుతూనే ఉంటారు. కానీ ఆయన దొరక్క అక్కడక్కడ తిరుగుతూనే ఉంటారు చాలా మంది ప్యాసింర్లు. కానీ, మీరు టీటీఈ కోసం వెతకాల్సిన అవసరం లేకుండా రైల్వే ఆయన కోసం సీట్ కూడా ఫిక్స్ చేసింది. రైల్వే సర్క్యులర్ ప్రకారం, రైలులోని అన్ని తరగతులలో TTE, సెక్యూరిటీ గార్డుల బెర్త్‌లు నిర్ణయించబడ్డాయి. రైల్వే శాఖ తీసుకున్న ఈ చర్యతో వెయిటింగ్, RAC టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకులకు ఎంతో ఉపయోగంగా మారింది. అతని కోసం మనం అన్ని బోగీలు తిరగాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా టీటీఈ చురుకోవచ్చు.
సాధారణంగా, ఆర్ఏసీ, వెయిటింగ్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకులు సీటు కోసం టీటీఈతో అవసరం ఉంటుంది. టీటీఈ అతని టికెట్‌ను కన్ఫం చేస్తుంటారు. అయితే టీటీఈ కూర్చునేందుకు ఒక్కో ట్రైన్‌లో ఒక్కోలా సీటింగ్ ఉంటుంది. ఆ వివరాలను తెలుసుకుందాం..
రాజధాని, ఇంటర్‌సిటీ..
శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పాటు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టీటీఈ, ప్రతి స్లీపర్ కోచ్‌లో 7 నంబర్ బెర్త్‌లు టీటీఈ కోసం నిర్ణయించబడ్డాయి. మరోవైపు, మీరు ఇంటర్‌సిటీ రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, మీరు టీటీఈ కోసం వెతుకుతూ తిరగాల్సిన అవసరం లేదు. D1, D3, D5 , D7 కోచ్‌లో 1 నంబర్ బెర్త్‌లో టీటీఈ ఉంటారు.
గరీబ్ రథ్
మీరు గరీబ్రత్ (చైర్‌కార్)లో ప్రయాణిస్తున్నట్లయితే.. ఇందులో కూడా టీటీఈకి ఓ బెర్త్ ఉంటుంది. అందులోనే అతను కూర్చుని ఉంటారు. G1, G,3, G5, G5 కోచ్‌లని 7 నంబర్ బెర్త్‌లో టీటీఈ ఉంటారు. మరోవైపు, మీరు గరీబ్ రథ్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తే, TTE కోచ్ B1, BE1 లకు 7వ బెర్త్ ఉంటుంది.
సూపర్ ఫాస్ట్ రైలు
మరోవైపు, సూపర్‌ఫాస్ట్ రైలులో ప్రయాణించే ప్రయాణికులు టీటీఈని కలవడానికి A1 కోచ్‌లో వెళ్లాలి. A1 కోచ్‌లో బెర్త్ నంబర్ 5లో టీటీఈ ఉంటారు. RPF, GRP సిబ్బందికి కూడా రైల్వే S1- 63 నంబర్ బెర్త్‌ను కేటాయించారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం




