IND vs AUS, World Cup Final: టీవీలో కూడా ఫైనల్ మ్యాచ్ చూడని ఆనంద్ మహీంద్రా.. కారణమేంటో తెలుసా?
ప్రస్తుతం దేశమంతా క్రికెట్ ఫీవర్‌లో మునిగిపోయింది. యావత్ భారతావని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ను చూస్తోంది. కొందరు డైరెక్టుగా స్టేడియంలోకి వెళ్లి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తోంటే మరికొందరు టీవీలు, మొబైల్ ఫోన్లలో మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. అయితే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా మాత్రం మ్యాచ్‌కు పూర్తిగా దూరంగా ఉన్నారట.
ప్రస్తుతం దేశమంతా క్రికెట్ ఫీవర్‌లో మునిగిపోయింది. యావత్ భారతావని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ను చూస్తోంది. కొందరు డైరెక్టుగా స్టేడియంలోకి వెళ్లి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తోంటే మరికొందరు టీవీలు, మొబైల్ ఫోన్లలో మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. అయితే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా మాత్రం మ్యాచ్‌కు పూర్తిగా దూరంగా ఉన్నారట. కనీసం టీవీలు, ఫోన్లలోనూ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ను చూడడం లేదట. దేశ సేవలో భాగంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరనమై పోస్ట్ షేర్ చేశారాయన. ఇంతకీ ఆనంద్ మహేంద్రా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారో తెలుసుకుందాం రండి. ఈ సందర్భంగా గోడకు తగిలించిన రెండు టీమిండియా జెర్సీ ఫొటోలను షేర్ చేసిన వ్యాపార దిగ్గజం.. ‘నేను ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూడడానికి ఎలాంటి ప్లాన్ చేసుకోవడం లేదు. ఇది దేశానికి నేను చేస్తున్న సేవ). టీమిండియా జెర్సీ ధరించి ఓ గదికి పరిమితమవుతాను. ఎవరైనా వచ్చి మనం విజయం సాధించామని చెప్పే వరకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటాను’ అని రాసుకొచ్చారు.
కాగా చాలామంది లాగే ఆనంద్ మహీంద్రా కూడా సెంటిమెంట్స్‌ను కూడా బాగా ఫాలో అవుతారంట. ఆయనెప్పుడైతే లైవ్ మ్యాచ్ చూస్తారో అప్పుడు భారత జట్టు పరాజయం పాలవుతోందనేది ఆయనకు ఉన్న నమ్మకమట. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ కారణంగానే ఇప్పుడు కూడా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఆనంద్ మహీంద్రా దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వ్యాపార దిగ్గజం పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది కూడా భారత జట్టుకు మద్దతుగా నిలవడమేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు ఎప్పటికీ మా హీరోనే సార్. చరిత్ర మీ త్యాగాన్ని గుర్తించకపోవచ్చు.. కానీ, మీ సేవలకు మేం ప్రాచుర్యం కల్పిస్తాం’ అని కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్ మాత్రం ఇవన్నీ అపోహలేనని, మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలంటూ కోరాడు.
No, no, I am not planning to watch the match (my service to the nation 🙂) But I will, indeed, be wearing this jersey and installing myself in a hermetically sealed chamber with no contact with the outside world until someone knocks and tells me we’ve won… pic.twitter.com/HhMENqORp1
— anand mahindra (@anandmahindra) November 19, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..