Will: వీలునామా అంటే ఏంటి.? వీలునామా రాయకపోతే ఏమవుతుంది.?

ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తులను ఎలా పంపిణీ చేయాలనుకుంటున్నారో వివరించే వీలునామాను రూపొందించాలి. వీలునామాను పకడ్బందీగా రూపొందించడం వెనకాల మరో కారణం ఉంది. చట్టపరమైన కోర్టు సమస్యల నుంచి వారసులను తప్పించవచ్చు. ఆసక్తిని సరైన విధంగా పంపిణీ జరిగేటట్లుగా పర్యవేక్షించడానికి వీలుంటుంది. అలాగే వారసుల మధ్య విభేదాలు రాకుండా ఉండడానికి...

Will: వీలునామా అంటే ఏంటి.? వీలునామా రాయకపోతే ఏమవుతుంది.?
Will
Follow us

|

Updated on: Nov 19, 2023 | 5:50 PM

వీలునామా అనే పదం మనం సర్వసాధారణంగా వింటూనే ఉంటాం. పలాన వ్యక్తి చనిపోయే ముందు వీలునామా రాశారు అని చెబుతుంటారు. వారసులకు తమ ఆస్తిని పంచేందుకు వీలునామా రాస్తుంటారు. స్థిర, చరాస్తులు కలిగిన వారు తమ తదనంతరం ఆస్తులను కుటుంబానికి అప్పగించడానికి వీలునామా రాసి పెడతారు.

ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తులను ఎలా పంపిణీ చేయాలనుకుంటున్నారో వివరించే వీలునామాను రూపొందించాలి. వీలునామాను పకడ్బందీగా రూపొందించడం వెనకాల మరో కారణం ఉంది. చట్టపరమైన కోర్టు సమస్యల నుంచి వారసులను తప్పించవచ్చు. ఆసక్తిని సరైన విధంగా పంపిణీ జరిగేటట్లుగా పర్యవేక్షించడానికి వీలుంటుంది. అలాగే వారసుల మధ్య విభేదాలు రాకుండా ఉండడానికి వీలునామా ఉపయోగపడుతుంది.

ఒకవేళ ఎవరైనా వీలునామా రాయకుండా మరణిస్తే.. వారి ఆస్తులు భారత దేశ వారసత్వ చట్టాల ఆధారంగా పంపిణీ చేస్తారు. అందుకే ప్రతీ ఒక్కరూ తమకు నచ్చిన విధంగా ఆస్తి పంపకాలు జరగాలంటే వీలునామా రూపొందించాలి. ఆస్తిని ఎలా పంపిణీ చేయాలనుకుంటున్నారో కచ్చితంగా పేర్కొనాలి. ఆస్తుల్లో కొంత భాగాన్ని వారసుల విద్యతో పాటు, ఇతర అవసరాల కోసం కేటాయించవచ్చు. పిల్లలు యుక్తవయస్సు వచ్చినప్పుడు ఈ నిధులను వారసత్వంగా పొందొచ్చు.

ఇక భారత్‌లో చట్టబద్ధంగా వీలునామా చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే.. వీలునామా సాధారణ కాగితంపై ముద్ర ఉండాలి. 18 ఏళ్లు పైబడిన వ్యక్తులు వీలునామా రాయడానికి అర్హులు. వీలునామా రాసుకునే సమయంలో కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి. అలాగే వీలునామా రాసే వ్యక్తి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో వీలునామా తీసుకుంటే డిజిటల్‌ సంతకం చెల్లదు. ఆన్‌లైన్‌లో వీలునామా రాస్తే, ప్రింట్‌ తీసుకుని సంతకం చేయాలి.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..