ప్రెజర్ కుక్కర్ నుంచి వాటర్ లీకై కిచెన్ మొత్తం పాడైపోతోందా.. ? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది..
గంటలు పట్టే వంట పనులు కుక్కర్ ఉపయోగించటం వల్ల నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. కానీ, ఈ కుక్కర్‌లో ఉపయోగించే రబ్బరు లేదా గాస్కెట్ అత్యంత సమస్యాత్మకమైనది. ఈ గాస్కెట్ వదులుగా ఉంటే, ఆహారం ఉడకదు. అలాగే, లోపల ఉన్న నీరంతా బయటకు పోతుంది. ఇలా ఈ కుక్కర్ మూత నుంచి వాటర్ లీక్ అవుతుంటుంది. దీంతో కుక్కర్ మూతపై మరకలు పేరుకుపోతాయి.

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉపయోగించబడుతుంది. ప్రెషర్ కుక్కర్ ఉపయోగించి వంట చేయటం వల్ల చాలా తక్కువ సమయంలో ఎక్కువ వంటలు పూర్తి చేస్తారు. గంటలు పట్టే వంట పనులు కుక్కర్ ఉపయోగించటం వల్ల నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. కానీ, ఈ కుక్కర్‌లో ఉపయోగించే రబ్బరు లేదా గాస్కెట్ అత్యంత సమస్యాత్మకమైనది. ఈ గాస్కెట్ వదులుగా ఉంటే, ఆహారం ఉడకదు. అలాగే, లోపల ఉన్న నీరంతా బయటకు పోతుంది. ఇలా ఈ కుక్కర్ మూత నుంచి వాటర్ లీక్ అవుతుంటుంది. దీంతో కుక్కర్ మూతపై మరకలు పేరుకుపోతాయి. అలాగే గ్యాస్ స్టౌపై కూడా మరకలు పడుతుంటాయి. గాస్కెట్ గట్టిగా లేకపోతే కుక్కర్ లో ప్రెజర్ సరిగ్గా పెరగదు. దీనివల్ల కుక్కర్ లోపల ఉన్న నీరు బయటకు పోతుంది. ఎంతసేపు ఉడికినా విజిల్ రాదు. అలాంటప్పుడు ఈ సులభమైన పద్ధతిని అనుసరించడం ద్వారా, మీరు కేవలం రెండు నిమిషాల్లో వదులుగా ఉన్న కుక్కర్ రబ్బరును టైట్‌గా బిగించవచ్చు.
గాస్కెట్ గట్టిగా లేకపోతే కుక్కర్ లో ప్రెజర్ సరిగ్గా పెరగదు. దీనివల్ల కుక్కర్ లోపల ఉన్న నీరు బయటకు పోతుంది. ఎంతసేపు ఉడికినా విజిల్ రాదు. అలాంటప్పుడు ఈ సులభమైన పద్ధతిని అనుసరించడం ద్వారా, మీరు కేవలం రెండు నిమిషాల్లో వదులుగా ఉన్న కుక్కర్ రబ్బరును టైట్‌గా బిగించవచ్చు.
వదులుగా ఉన్న కుక్కర్ రబ్బరును గోరువెచ్చని నీటిలో 2 నుండి 3 నిమిషాలు ఉంచాలి. అలా చేయడం వల్ల రబ్బరు దాని అసలు పరిమాణానికి తిరిగి వస్తుంది. తరువాత ఈ రబ్బరు మీద కొంచెం పొడి పిండి చల్లుకోండి. మీరు ఇలా చేసిన వెంటనే, రబ్బరు మళ్ళీ కుక్కర్ మూత మీద సరిగ్గా సరిపోతుంది. మళ్ళీ విజిల్ మోగుతుంది.
మరొక పద్ధతి ఏమిటంటే కుక్కర్ గాస్కెట్‌ను 10 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచడం. ఇది వదులుగా ఉన్న రబ్బరు దాని అసలు పరిమాణానికి తిరిగి రావడానికి కూడా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








