AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lizards: ఇంట్లో బల్లులతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి వెంటనే పరార్‌..!

ఇళ్లలో బల్లుల సమస్య సర్వసాధారణం. అయితే ఇంట్లో బల్లి కనిపించిందంటే చాలు చాలా మంది వణికిపోతుంటారు. బల్లి ఉన్న ప్రాంతానికి అస్సలు వెళ్లరు. ఇంట్లో బల్లులు పారిపోయేందుకు ఎన్నో ప్రయత్నాలు..

Lizards: ఇంట్లో బల్లులతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి వెంటనే పరార్‌..!
Lizards
Subhash Goud
|

Updated on: Jan 29, 2023 | 9:23 PM

Share

ఇళ్లలో బల్లుల సమస్య సర్వసాధారణం. అయితే ఇంట్లో బల్లి కనిపించిందంటే చాలు చాలా మంది వణికిపోతుంటారు. బల్లి ఉన్న ప్రాంతానికి అస్సలు వెళ్లరు. ఇంట్లో బల్లులు పారిపోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పదేపదే వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కానీ కొన్ని సులభమైన పద్దతులతో మీ ఇంట్లో ఉన్న బల్లులను తరిమికొట్టవచ్చు.

☛ బల్లి ఎక్కువగా వచ్చే ఇంటి మూలలో వెల్లుల్లి, ఉల్లిపాయలను కలిపి వేలాడదీయండి. దీని వాసన ఎక్కడి గదుల్లోకి చేరుతుందో అక్కడ బల్లులు రావు. ఫ్యాన్‌కింద ఉంచడం వల్ల దాని పరిమళం ఇల్లంతా వ్యాపిస్తుంది. దీంతో బల్లి పారిపోతుంది.

☛ బల్లులు ఉన్న ప్రదేశాల్లో కోడి గుడ్డు పెంకులను ఉంచడం వల్ల మేలు జరుగుతుంది. బల్లులు అక్కడికి రావు. నిజానికి బల్లులు గుడ్డు పెంకుల వాసన నుండి పారిపోతాయి. ఈ వాసన బల్లులకు నచ్చదని, అందుకే పారిపోతాయని నిపుణులు చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

☛ పెప్పర్ స్ప్రే బల్లులను గోడలు, గదుల నుండి దూరంగా ఉంచుతుంది. మీరు ఇంట్లో కూడా ఈ స్ప్రేని సిద్ధం చేసుకోవచ్చు. దీనికి ఎండుమిర్చి గ్రైండ్ చేసి నీళ్లలో కలపాలి. దీని తరువాత మీరు దానిని సీసాలో ఉంచి స్ప్రే చేయవచ్చు. స్ప్రే చేస్తే బల్లి పారిపోతుంది.

☛ చలికాలంలో చల్లటి గదుల్లో బల్లులు ఎక్కువగా కనిపించవు. ఎందుకంటే అవి వెచ్చని ప్రదేశాలను ఇష్టపడతాడు. అటువంటి పరిస్థితిలో మీరు గోడపై బల్లిని చూసినట్లయితే అక్కడ నీటిని కూడా చల్లుకోవచ్చు. బల్లులు ఆహారం కోసం వెతుకుతుంటాయి. ఇంట్లోని సింక్‌లో జంక్ ఫుడ్‌ను ఉంచవద్దు. ఏసీ సహాయంతో ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా బల్లులను గది నుండి తరిమికొట్టవచ్చు. ఇలా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఇంట్లో బల్లులు రాకుండా చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం